జ‌గ‌న్ ప‌క్క‌సీటులో కూర్చుంటే ఏమ‌వుద్దో తెలుసా?

Update: 2016-05-23 09:37 GMT
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ను టార్గెట్ చేయ‌డంలో ముందుండే టీడీపీ నేత‌లు తాజాగా జ‌గ‌న్‌ పై కొత్త విమ‌ర్శ‌ చేశారు. అనంతపురం జిల్లాలో జరిగిన తెలుగుదేశంపార్టీ మినీ మహానాడులో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి - ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ప్ర‌తిప‌క్ష నేత తీరుపై మండిప‌డ్డారు.

ప్రాంతీయ పార్టీలను నడపడం అందరి తరం కాదని తొమ్మిది నెలల్లో చిరంజీవి త‌న ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేయడమే ఇందుకు ఉదాహరణ అని కేశ‌వ్ అన్నారు. జగన్‌ తనకున్న రూ.వేలాది కోట్లతో ఏమైనా చేయవచ్చన్న భావనతో ఉన్నారని ఆరోపించారు.  వైఎస్ జ‌గ‌న్ ఒంటెత్తు పోక‌డ‌ల‌కు పెట్టింది పేర‌ని, అహంకారభావాన్ని ప్రదర్శిస్తుండటంతో ఆయన వెనుక ఉన్న వారు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారని పేర్కొన్నారు. ఆయన పార్టీలో ఎవరూ మిగిలే పరిస్థితి లేదన్నారు. కనీసం ఆయన పక్క సీటులో కూర్చున్నా ఓర్చుకోలేడని ఆ పార్టీలో కొనసాగిన సీనియ‌ర్ నేత‌లు జ్యోతుల నెహ్రు - మైసూరారెడ్డి చెప్పిన విషయాన్ని ప‌య్యావుల‌ గుర్తు చేశారు.

త‌మ పార్టీ అధినేత‌ చంద్రబాబు మాత్రమే ప్రాంతీయ పార్టీని సమర్థంగా నడుపుతూ తెదేపాను జాతీయ స్థాయికి తీసుకుపోయారని కేశ‌వ్ ప్ర‌శంసించారు. అధికార దాహంతో తొమ్మిది నెలల్లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌ పార్టీకి అమ్మేస్తే, వైకాపా  డబ్బుతో రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కేశ‌వ్ విమర్శించారు. రాష్ట్రంలో కిష్ట పరిస్థితులు ఉన్నా ఇటు ప‌రిపాల‌న అటు కేంద్ర ప్ర‌భుత్వంతో స‌ఖ్య‌త‌ను కొన‌సాగిస్తున్న ఘ‌న‌త బాబుకు ద‌క్కింద‌న్నారు. ఏ సంద‌ర్భంలోనూ రాజ‌కీయాల్లో రాజీప‌డ‌ని వ్య‌క్తిత్వం త‌మ నాయ‌కుడి సొంత‌మ‌ని కేశ‌వ్ గుర్తుచేశారు. రైతుల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని ఆయ‌న‌ చెప్పారు.
Tags:    

Similar News