తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ రథసారథి - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు దూమారం లేపాయి. చంద్రబాబును చెప్పుతో కొట్టాలని జగన్ వ్యాఖ్యానించిన తీరుపై తెలుగుదేశం నాయకులు ఫైరయ్యారు. చంద్రబాబుపై మరోసారి నోరు పారేసుకుంటే ప్రజలే బుద్ధి చెపుతారని హెచ్చరించారు. తెదేపా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అయితే ఇంట్లో పని చేయటం చేతకాక ఊరు మీద పడి జగన్ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తొలి నుంచి జగన్ కు మానసిక పరిస్థితి సరిగా లేదని, జగన్ ను భరించలేక వైఎస్ గతంలో బెంగళూరుకు పంపారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన జగన్ తప్పులకు పరిహారం జైలుకి వెళ్లినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. పార్టీ నేతలు ఆయన ప్రవర్తనతో దూరం అవుతున్నారని అలా ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిగి పోయాయని ఎద్దేవా చేశారు. రెక్కలు విరిగిన ఫ్యాన్‌ను ఓఎల్ ఎక్స్ లో అమ్మేయాలని జగన్ కు సూచించారు.
మరోవైపు అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏకంగా జగన్ తో హోరాహోరీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా యాడికిలో పర్యటిస్తున్న జగన్ ను అడ్డుకునేందుకు తన అనుచరులతో కలిసి 40 వాహనాల్లో బయల్దేరి వెళ్లారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.