తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు నాయకులను కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారుతోంది. నమ్మినబంటులాంటి సీఎం రమేశ్ సహా నలుగురు ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. ఇటు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకో - వైసీపీలోకో వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తేనే తమ పార్టీలోకి రావాలని జగన్ స్పష్టంగా చెబుతుండడంతో చచ్చీ చెడీ గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు అలాంటి ధైర్యం చేయడం లేదు. కానీ.. రాయలసీమ నుంచి గెలిచిన ఓ ఎమ్మెల్యే మాత్రం అందుకు సిద్ధపడుతున్నారని టాక్.
రాయలసీమ నుంచి ముగ్గరు మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు. అందులో ఒకరు చంద్రబాబు - ఇంకొకరు బాలకృష్ణ కాగా మూడో వ్యక్తి పయ్యావుల కేశవ్. చంద్రబాబు కుటుంబాన్ని పక్కన పెడితే రాయలసీమలో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక వ్యక్తి పయ్యావులే. ఇప్పుడాయన వైసీపీలో చేరాలని తాపత్రయ పడుతున్నారని అనంతపురంలో టాక్.
పయ్యావుల దురదృష్టమేమో కానీ.. ఆయన గెలిచినప్పుడు పార్టీ ఓడిపోతుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఓడిపోతున్నారు. దీంతో సీనియర్ నేత అయినప్పటికీ - సబ్జెక్ట్ ఉన్నప్పటికీ మంత్రి పదవి ఆయనకు అందని ద్రాక్షగా మారింది. అంతేకాదు.. అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఫుల్ స్వింగ్ లో ఉండే అవకాశమూ రాలేదు. పయ్యావులలో అలాంటి అసంతృప్తి తీవ్రంగా ఉందట.
దీంతో.. ఇప్పుడు వైసీపీలో చేరి అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగాలని ఆశపడుతున్నారట. అందుకే.. వైసీపీపై ఎక్కడా ఏమీ మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్నారట ఆయన. మామూలుగా మంచి వక్త... రాజకీయ ప్రత్యర్థులపై దూకుడుగా మాట్లాడే కేశవ్ అసెంబ్లీలో కానీ - బయట కానీ ఏమీ సౌండ్ చేయడం లేదు.
పయ్యావులను వైసీపీలోకి తీసుకోవడానికి ఆ పార్టీ సిద్ధంగానే ఉన్నప్పటికీ అక్కడి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని ఒప్పించి పయ్యావులను తేవాలనుకుంటున్నారట. అంతేకాదు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వస్తే మళ్లీ గెలిపించుకుంటామని చెబుతున్నారట. అందుకు పయ్యావుల కూడా సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది.