ఐపీఎల్లో ఇవాళ రికార్డుల మోత మోగిపోద్దా..!

Update: 2021-04-16 06:31 GMT
గత సీజన్​ లో డీలా పడ్డ సీఎస్  కే జట్టు ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని చూస్తున్నది. ఇప్పటికే ఢిల్లీతో జరిగిన మ్యాచ్​ లో ఓడిపోయింది. ఆ మ్యాచ్​ లో కెప్టెన్ ధోనీ డకౌట్​ అయ్యాడు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. సీఎస్​ కే జట్టుకు విపరీతమైన ఫ్యాన్​ ఫాలోయింగ్​ ఉంటుంది. అందుకు కారణం ఆ జట్టుకు మహేంద్రసింగ్​ ధోనీ ప్రాతినిథ్యం వహిస్తుండటమే.. గత సీజన్​ లో సీఎస్​కే పెద్దగా రాణించలేకపోయింది. కనీసం ప్లే ఆప్స్​ కు కూడా వెళ్లలేకపోయింది.

ఈ రోజు పంజాబ్​ కింగ్స్​ తో సీఎస్​కే తలపడనున్నది. ఈ మ్యాచ్​ లోనైనా చెన్నై గెలవాలని ఫ్యాన్స్​ కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్​ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇవాళ సీఎస్​కే గెలిచిన ఓడినా.. జట్టులోని కొందరు క్రికెటర్లు రికార్డులు బద్దలు కొట్టనున్నారు. ఎందుకంటే చాలా మంది రికార్డులు కొట్టేందుకు చాలా చేరువలో ఉన్నారు.

ఐపీఎల్ 14వ సీజన్‌ ఎనిమిదో మ్యాచ్‌ లో భాగంగా  ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ జట్లు  తలపడనున్నాయి.  అయితే ఈ మ్యాచ్​లో సురేశ్​ రైనా ఓ అరుదైన రికార్డుకు సిద్ధంగా ఉన్నాడు. అతడు 500 ఫోర్లు, 200 సిక్సర్లు కొట్టేందుకు కేవలం కొద్దిదూరంలో ఉన్నాడు. ఒకవేళ కొద్దిసేపు క్రీజ్​లో నిలిచినా సురేశ్​ రైనా ఈ రికార్డును సాధించే అవకాశం ఉంది.

ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ కూడా ఐపీఎల్‌ లో ప్రత్యేక స్థానానికి చేరుకోబోతున్నాడు. 50 వికెట్లకు అడుగు దూరంలో ఉన్నాడు.  చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఐపీఎల్‌ లో 50 వికెట్లు పూర్తి చేయబోతున్నాడు, చాహర్ మాదిరిగా పంజాబ్ కింగ్స్‌ పై ఈ రికార్డును పూర్తి చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ హెన్రిక్స్ ఐపీఎల్‌ లో 1000 పరుగులు పూర్తి చేయడానికి దగ్గరగా ఉన్నాడు. హెన్రిక్స్​ ఇప్పటికే ఐపీఎల్​లో 969 పరుగులు చేశాడు. మరో 31 పరుగుల దూరంలో ఉన్నాడు.
Tags:    

Similar News