నెమ‌ళ్లు సెక్స్ చేయ‌వ‌న్న ఆ హైకోర్టు జడ్జి

Update: 2017-06-01 06:19 GMT
ప‌రిస్థితులు మారాయి. గ‌తంలో కొన్ని స్థానాల్లో ఉన్న వారు చేసే వ్యాఖ్య‌లు ఆచితూచి ఉండేవి. ఒక‌రిద్ద‌రూ అందుకు భిన్నంగా వ్యాఖ్య‌లు చేసినా.. ప‌రిమిత‌మైన మీడియా పుణ్య‌మా అని పెద్ద‌గా ఫోక‌స్ అయ్యేవి కావు. కానీ.. ఇప్పుడా ప‌రిస్థితి లేదు. కొన్ని అంశాల్ని మీడియా ప‌ట్టించుకోకున్నా.. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని వైర‌ల్ అయిపోతూ.. కోట్లాది మందికి స‌మాచారం అందిపోతోంది.

దీనికి తోడు.. సోష‌ల్ మీడియాలో ఉన్న సౌల‌భ్యం ఏమిటంటే.. ఎవ‌రికి వారు త‌మ త‌మ అభిప్రాయాల్ని ఓపెన్ గా పంచుకోవ‌చ్చు. గీత దాట‌నంత వ‌ర‌కూ చ‌ట్టం క‌న్ను దాని మీద ప‌డ‌దు. దీంతో.. గీత దాటకుండానే.. కోట్లాది మంది త‌మ మ‌న‌సులోని అభిప్రాయాల్ని ఓపెన్ గా షేర్ చేసేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా దేశ‌వ్యాప్తంగా గోమాంస నిషేధంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గోమాంసం అమ్మ‌కాల్ని పూర్తిగా నిలిపివేయాల‌ని.. నిషేధం విధించాల‌ని.. ఆవును జాతీయ జంతువుగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తుంటే.. మ‌రికొంద‌రు దీనికి విరుద్ధ‌మైన అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. వాద ప్ర‌తివాద‌న‌ల‌తో వాతావ‌ర‌ణం మ‌రింత వేడెక్కిపోతోంది. ఇదిలా ఉండ‌గా.. ఈ వాద‌న‌లోకి రాజ‌స్థాన్ హైకోర్టు జ‌డ్జి మ‌హేశ్ చంద్ర వ‌చ్చేశారు.

చాలామంది జ‌డ్జిలు త‌మ అభిప్రాయాల్ని ఆచితూచి వెల్ల‌డిస్తుంటారు. జ‌స్టిస్ మ‌హేశ్ చంద్ర ఈ విష‌యంలో ఒక అడుగు ముందుకేసి.. ఆవును జాతీయ జంతువుగా ప్ర‌క‌టించాల‌ని వ్యాఖ్యానించ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ఇదింకా ఒక కొలిక్కి రాక ముందే.. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. నెమ‌ళ్లు బ్ర‌హ్మ‌చారులు కావ‌టం వ‌ల్లే వాటిని జాతీయ‌ప‌క్షిగా ప్ర‌క‌టించార‌ని.. అవి శృంగారంలో పాల్గొన‌వంటూ వ్యాఖ్య‌లు చేశారు.

నెమ‌ళ్లు సెక్స్ చేయ‌కుండా వాటికి గుడ్లు ఎలా వ‌స్తాయ‌న్న విష‌యాన్ని మ‌రింత వివ‌రంగా ఆయ‌న చెప్పుకొచ్చారు. మ‌గ నెమ‌లి బ్ర‌హ్మ‌చారిగానే ఉండిపోతుంద‌ని.. ఆడ నెమ‌లితో అస‌లు శృంగారం చేయ‌ద‌న్నారు. మ‌గ‌నెమ‌లి క‌న్నీళ్లు తాగ‌టం వ‌ల్లే ఆడ నెమ‌లి గ‌ర్భం దాలుస్తుంద‌ని.. అందుకే శ్రీకృష్ణుడు లాంటి అవ‌తార పురుషుడు నెమ‌లి ఫించాన్ని త‌ల‌పై ధ‌రించిన‌ట్లుగా జ‌స్టిస్ మ‌హేశ్ చంద్ర వ్యాఖ్యానించారు. ఆవును జాతీయ జంతువుగా ప్ర‌క‌టించాల‌న్న త‌న వాద‌నను వినిపించే స‌మ‌యంలో నెమ‌ళ్ల ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. ఆవును జాతీయ జంతువుగా ప్ర‌క‌టించాల‌న్న డిమాండ్‌ కు.. లౌకికవాదంతో సంబంధం లేద‌న్నారు. మ‌రి.. ఈ విష‌యంపై కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News