పెద్దారెడ్డి వ‌ర్సెస్ జేసీ.. చార్జిషీట్ మాయం కేసు మ‌రో మ‌లుపు!

Update: 2023-01-04 08:09 GMT
ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రోసారి రాజ‌కీయ భోగి మంట‌లు అలుముకున్నా యి. తాడిపత్రి కోర్టులో జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించి వాహ‌నాల న‌కిలీ రిజిస్ట్రేష‌న్ కేసులో ఛార్జ్షీటు మాయమైందని వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్  కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచ‌ల‌నం సృష్టించాయి.

ఈ చార్జిషీట్ మాయం చేసేందుకు 30-40 ల‌క్ష‌ల రూపాయ‌లుచేతులు మారాయ‌ని.. దీనిలో కోర్టు సిబ్బంది పాత్ర కూడా ఉంద‌ని పెద్దారెడ్డి విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే.

అయితే..తాజాగా పెద్దారెడ్డి వ్యాఖ్య‌ల‌పై మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. కోర్టులో ఉన్న ఛార్జ్షీట్ పోయిందన్న విషయం పెద్దారెడ్డికి ఎలా తెలిసిందని నిలదీశారు. తాడిపత్రి కోర్టులో తన మీద పోలీసులు వేసిన ఛార్జ్షీట్ మాయమైందని వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎవరు చెప్పారని  ప్రశ్నించారు.

కర్నూలు, అనంతపురం జిల్లాలో తనపై 29 కేసులు పెట్టారని, తాడిపత్రిలో వేసిన ఒక కేసుకు సంబంధిం చిన ఛార్జ్షీటు తాను ఎందుకు మాయం చేస్తానో ఎమ్మెల్యే చెప్పాలన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డికి, చార్జిషీట్ విషయం డీఎస్పీ సమాచారం ఇచ్చారని ఆరోపించారు. కోర్టులో విషయాలు ఎవరు చెప్పారో తేల్చాలని ఆయన కోరారు. పెద్దారెడ్డి ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాల్సి ఉందన్నారు.

కోర్టులో ఉన్న ఛార్జ్షీటు పోయిందన్న విషయం జిల్లా ఎస్పీకి అయినా తెలిసిందో లేదో కానీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి మాత్రం సమాచారం ఎలా వెళ్లిందని జేసీ ప్రశ్నించారు. కోర్టులంటే తనకు అపారమైన గౌరవం ఉందని, కోర్టును కించపరిచేలా ఛార్జ్షీట్ పోయిందని మాట్లాడిన పెద్దారెడ్డిపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు.

ఆయ‌న‌పై కేసు పెట్టాల‌ని పోలీసుల‌ను కోర‌తాన‌ని చెప్పారు. ఇక‌, ఇప్ప‌టికే పెద్దారెడ్డి.. జేసీ బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య ఉప్పు-నిప్పుగా వ్య‌వ‌హారం ఉన్న నేప‌థ్యంలో తాజా వ్యాఖ్య‌లు మ‌రింత మంట రేపుతున్నాయి. ఎన్నికల ముందు ఇవి ఎటు మ‌లుపుతిరుగుతాయో చూడాలి.     



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News