తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు బెదిరిస్తూ ఉన్నారని - స్థానిక ఎన్నికల్లో నామినేషన్లను వేయనివ్వడం లేదని చంద్రబాబు నాయుడు ఆరోపించిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. అభ్యర్థులు దొరక్కే చంద్రబాబు నాయుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి.
తెలుగుదేశం పార్టీకి కొన్ని చోట్ల అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదని, ఆ పార్టీ తరఫున స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ పార్టీ వాళ్లే ముందుకు రావడం లేదని - ఇలాంటి పరిస్థితిని కవర్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు కేవలం తమ వైఫల్యాన్ని కవర్ చేసుకోవడానికి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబాంఢాలు వేస్తున్నారన్నట్టుగా మంత్రి అన్నారు.
మరి కొన్ని చోట్ల ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి బలం లేని వైనాన్ని ఆయన ప్రస్తావించారు. అందుకు ఉదాహరణ తన నియోజకవర్గమే అని ఆయన పేర్కొన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా నెగ్గిందా? స‌్థానిక ఎన్నికల్లో టీడీపీ ఎప్పుడైనా అక్కడ సత్తా చాటిందా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఏనాడూ గెలవని చోట ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నామినేషన్లను కూడా వేసుకోలేకపోతోందని మంత్రి అన్నారు.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు నామినేషన్లు దాఖలు కాని వైనం గురించి మాట్లాడుతున్నారని - నామినేషన్లను తమ వారి చేత వేయించలేక...వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరిస్తోందని చంద్రబాబు నాయుడు అంటున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని చోట్ల నామినేషన్లు దాఖలు కాకపోవడానికి కారణం.. ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడమే తప్ప.. తాము బెదిరించడం అనేది అబద్ధమని మంత్రి ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేసినట్టుగా ఉన్నారు!