కరోనా కబళిస్తోంది. వరుసగా ప్రముఖులను ఆవహిస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖుల్లో ఎక్కువశాతం మందికి సోకుతోంది. రోజురోజుకు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
కేంద్రంలో వరుసగా కేంద్రమంత్రులు కరోనా బారిన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ వరుసగా ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇది వ్యాపిస్తోంది. ఇప్పటికే చాలా మంది వ్యాధి బారినపడ్డారు.
ఏపీలో అయితే కరోనా విజృంభిస్తోంది. రోజుకు 10వేల కేసుల చొప్పున నమోదవుతున్నాయి. ఏపీలో మరో మంత్రికి కరోనా సోకింది. కేబినెట్ లో సీనియర్ అయిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
పెద్దిరెడ్డిని వెంటనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నట్టు తెలిసింది.
ఇప్పటికే మంత్రులు బాలినేని, ఆదిమలపు సురేష్ లు కరోనా బారినపడ్డారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డికి సోకింది. తనతో కాంట్రాక్టులో ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.