పెగాసెస్‌ స్పైవేర్‌ .. స్పందించిన ఇజ్రాయెల్ .. మంత్రుల కమిటీతో దర్యాప్తు !

Update: 2021-07-22 07:50 GMT
పెగాసెస్‌ స్పైవేర్‌ ..  అన్ని రంగాల ప్రముఖులపై ప్రభుత్వమే నిఘాకు పాల్పడిందనే ఆరోపణల వ్యవహారం భారత్‌ సహా పలు దేశాలను కుదిపేస్తున్న సమయంలో ఆ సంస్థ సొంత దేశమైన ఇజ్రాయెల్ స్పందించింది. ఇజ్రాయెల్ కు చెందిన ఎన్‌ ఎస్‌ వో సంస్థ ఈ స్పైవేర్‌ ను వివిధ దేశాలకు విక్రయించిన నేపథ్యంలో సదరు వ్యవహారాలపై ఇజ్రాయెల్‌ మంత్రుల బృందం ఒకటి దర్యాప్తు జరపనుంది. ఈ బృందానికి ఇజ్రాయెల్ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ నేతృత్వం వహించనుంది.

ఈ మేరకు రాయిటర్స్ సంస్థ బుధవారం కథనాలను ప్రసారం చేసింది. ఇజ్రాయెల్‌ కు చెందిన ఎన్‌ ఎస్‌ ఓ గ్రూప్‌ రూపొందించిన ఈ సాఫ్ట్‌ వేర్‌ పలువురు ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్‌ చేసిందన్న వార్తలు వెలవడ్డాయి. స్పైవేర్‌ తో సంపాదించిన 50వేలకు పైగా ఫోన్‌ నెంబర్ల జాబితా ఫొరిబిడెన్‌ స్టోరీస్‌ అనే ఎన్‌ జీఓకు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ కు చిక్కింది. ఈ జాబితాను ప్రముఖ మీడియా గ్రూపులు విశ్లేషించాయి.

50 దేశాల్లో వెయ్యికి పైగా కీలక వ్యక్తులు నెంబర్లను ఇందులో గుర్తించారు. నిఘా స్పైవేర్‌ కు సంబంధించి ఎన్‌ ఎస్‌ ఓ గ్రూప్‌ పై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ గతేడాది ఇజ్రాయిల్‌ కోర్టులో దావా వేసింది. అయితే సరైన ఆధారాలు లేవని కోర్టు ఈ పిటిషన్‌ కొట్టేసింది.

భారత్‌ సహా 50 దేశాలకు చెందిన వ్యక్తుల పేర్లు పెగాసస్‌ స్పైవేర్‌ కు చెందిన టార్గెట్ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో జర్నలిస్టులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు, మానవ హక్కుల కార్యకర్తలు ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ లో దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అధికార పార్టీపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తుండగా.. దీంతో తమకేమాత్రం సంబంధం లేదని ప్రభుత్వం చెబుతోంది. పెగాసస్ ఉదంతంలో కేంద్రం పాత్రను నిర్ధారించేందుకు ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ఈనెల 28న భేటీ కానుంది.

 పార్లమెంట్ సమావేశాలకు ముందురోజే వాషింగ్టన్‌ పోస్ట్‌ లీమాండేలతో సహా ప్రపంచంలోని అనేక ప్రముఖ పత్రికలలో ఈ వార్త వివరాలతో సహాప్రచురితమైంది.భారతదేశంలో దవైర్‌ న్యూస్‌ దీన్ని ప్రచురించింది. నిరసనలను అణచివేయడంలోనూ ప్రత్యర్థులపై నిఘా వేయడం లోనూ నిర్బంధం సాగించడంలోనూ ఇజ్రాయిల్‌ పేరు మోసింది. ఆ దేశానికి చెందిన ఎస్‌.ఎస్‌.వోగ్రూపు పెగాసస్‌ ను తయారు చేసింది. ఎవరిఫోన్లనైనా హ్యాక్‌ చేయగల శక్తి దీనికివుంటుంది. అయితే దీన్ని కేవలం ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తామని ఎస్‌ఎస్‌వో చెబుతున్నది. అంటే భారతప్రభుత్వం దీన్ని తీసుకుని వుండాలి.

ఈ విషయమై పార్లమెంటులో నిరసన ప్రతిధ్వనించినప్పుడు కొత్తగా ఐటి శాఖ చేపట్టిన అశ్విని వైష్ణవ్‌ మాట్లాడుతూ అనధికారికంగా ఫోన్లపై నిఘా వేయడం సాధ్యం కాదన్నారు.అంటే అధికారిక అనుమతితోనే చేసినట్టు స్పష్టం అవుతుంది.భారతదేశంలో వందలాది మంది జర్నలిస్టులే గాక ప్రతిపక్ష నాయకుల ఫోన్ల నెంబర్లు నిఘాకు గురైన జాబితాలో వున్నాయి.ఇదే విధంగా ప్రపంచంలో మొత్తం యాభై వేల ఫోన్లను హ్యాక్‌ చేసిన ఘటనలు జరిగాయని నివేదికలు చెబుతున్నాయి. మోడీ మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రుల నెంబర్లు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఒకరి ఫోన్‌ నెంబర్‌ , అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గోగోయ్‌ పై ఆరోపణ చేసిన మహిళ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌, రాహుల్‌ గాంధీల నెంబర్లు కూడా అందులో వున్నాయి.
 
వాస్తవానికి రెండేళ్ల కిందటే రాజ్యసభలో సిపిఎం సభ్యుడు రాగేశ్‌ పెగాసస్‌ వ్యవహారాన్ని లేవనెత్తి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.వాట్సప్‌ లో స్పైవేర్‌ ద్వారా ఆ గుట్టు బహిర్గతమైంది,. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా ప్రభుత్వం ఎస్‌ ఎస్‌ వో సేవలు వినియోగించుకుంటున్న విషయాన్ని నిరాకరించలేదు.

ఇందుకు సంబందించిన నియమనింబధనలేమిటి, ఖర్చు చేసిన నిధులెన్ని, అసలు భారతదేశంలో చట్టాలు, సుప్రీం కోర్టు తీర్పులు నిఘాకోసం సాప్ట్‌ వేర్‌ ను వినియోగించడం రాజ్యాంగ విరుద్దం. వ్యక్తుల గోప్యతకు ప్రాథమిక హక్కులకు భంగకరం.ఈ విధమైన అక్రమ మార్గాలలోనే ఎందరో కార్యకర్తల కంప్యూటర్లలోదూరి ఏవో సమాచారం సేకరించి, జొప్పించి అక్రమ కేసులలో నిర్బంధించారు. ఇప్పుడు ఒక్కసరిగా వివరాలు బహిర్గతమయ్యేసరికి సమర్థించుకోలేక టెంక్షన్ పడుతున్నారు.
Tags:    

Similar News