ఆయన పేరు పెండెం దొరబాబు. రాజకీయంగా అనేక ఏళ్ల పాటు పోరాటం చేసిన మీదట కానీ అసెంబ్లీ ముఖం చూడలేదు. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తరువాత చాలా పార్టీలను చూశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నపుడు టికెట్ చివరి దాకా వచ్చినట్లే వచ్చి నో చెప్పేశారు. దాంతో ఆయన బీజేపీలో చేరారు. కానీ బీజేపీ వారు చివరికి హ్యాండ్ ఇచ్చారు.
ఇక లాభం లేదనుకుని ఇండిపెండెంట్ గా పోటీ చేసి కోరిక తీర్చుకున్నారు కానీ ఎమ్మెల్యే కాలేకపోయారు. వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే జగన్ వేవ్ లో పిఠాపురం నుంచి గెలిచారు. అలా పెండెం దొరబాబు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కుతుందా లేదా అన్న చర్చ సొంత పార్టీలోనే ఉంది.
పిఠాపురంలో చూస్తే కాకినాడ ఎంపీ వంగా గీతకు కూడా మంచి పట్టు ఉంది. ఆమె సైతం పిఠాపురంలో 2009 ఎన్నికల్లో గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆమె అలా విజయం సాధించారు. దాంతో ఆమె మరోమారు అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఇక దొరబాబు పెర్ఫార్మెన్స్ మీద వైసీపీ అధినాయకత్వానికి వచ్చి చేరుతున్న నివేదికలు అన్నీ కూడా నిరాశాజనకంగా ఉంటునాయని అంటున్నారు.
అయినా సరే దొరబాబు మాత్రం టికెట్ నాదే అని ధీమా వ్యక్తం చేయడం విశేషం. పైగా తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. పవన్ వచ్చినా నాకు ఏ సమస్య లేదు. మా అధినాయకత్వం టికెట్ ఇస్తే చాలు గెలుస్తా అని చెప్పడం విశేషం. పిఠాపురం నిండా నా బంధువులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ఉన్నారని ఆయన అంటున్నారు.
పైగా నేను కూడా కాపు సామాజికవర్గానికి చెందిన వాడినే, నేను పక్కా లోకల్ అందువల్ల నేను కాక ఎవరు గెలుస్తారు అని ఆయన ధీమాగా చెబుతున్నారు. ఇక జనసేన వైపు నుంచి చూస్తే సీరియస్ గా పవన్ పరిశీలిస్తున్న నియోజకవర్గాలలో పిఠాపురం కాకినాడ రూరల్ ఉన్నాయి. అలాగే తిరుపతి నుంచి కూడా పవన్ పోటీ చేయవచ్చు అని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాకలలో పోటీ చేసి ఓడిపోయారు. మరోమారు భీమవరం నుంచి పోటీ చేస్తారు అని అంటున్నా కొత్త నియోజకవర్గాల మీదనే ఆయన కన్ను ఉంది అని అంటున్నారు. గోదావరి జిల్లాలలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా పిఠాపురం మీదనే ఫోకస్ పెట్టారని అంటున్నారు. దానికి కారణం నాడు పీయార్పీ ఈ సీటుని గెలుచుకుంది. 2019లో మాకినీడు శేషుకుమారి జనసేన తరఫున పోటీ చేస్తే 28 వేల దాకా ఓట్లు వచ్చాయి.
అంటే పిఠాపురంలో జనసేనకు మంచి బలం ఉన్నట్లుగా లెక్క వేస్తున్నారు. ఇపుడు గ్రాఫ్ బాగా పెరిగింది కాబట్టి పైగా పవన్ కనుక దిగితే గెలుపు తధ్యమని అంటున్నారు. తెలుగుదేశంతో పొత్తు కనుక ఉంటే లక్ష మెజారిటీ రావడం ఖాయమని కూడా జనసైనికులు లెక్కలు వేస్తున్నారు. మొత్తానికి పవన్ని ఓడిస్తాను అంటూ బీరాలు పోతున్న పెండెం దొరబాబుకు ఇంతకీ టికెట్ వస్తుందా అని జనసేన నేతలే ప్రశ్నిస్తున్నారుట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.