వేశ్యలు..జల్సాలతో ఎన్ ఆర్ ఐపై అమెరికాలో కేసు

Update: 2016-12-22 14:10 GMT
కీలక స్థానాల్లో విధులు నిర్వహించే వారు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వారిని ప్రలోభ పెట్టటానికి.. పక్కదారి పట్టించటం కోసం ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారికి చిక్కకుండా ఉండాల్సిన ఒక ప్రవాస భారతీయ ప్రముఖులు ప్రస్తుతం అమెరికా పోలీసుల అదుపులో ఉన్నారు. భారీ మొత్తంలో డబ్బులు.. డగ్ర్స్.. అమ్మాయిల ప్రలోభానికి గురై లగ్జరీ కోసం అడ్డదారులు పట్టిన పాపం ఇప్పుడాయన్ను వెంటాడటమే కాదు.. నేరం రుజువైతే ఇరవైఏళ్ల జైలుశిక్ష పడే ప్రమాదంలో ఆయన చిక్కుకున్నారు.

భారత సంతతికి చెందిన నవనూర్ కంగ్ అమెరికాలో కీలకమైన స్థానంలో విధులు నిర్వహించేవారు. న్యూయార్క్ స్టేట్ కామన్ రిటైర్మెంట్ ఫండ్ కు డైరెక్టర్ గా.. వ్యూహకర్తగా వ్యవహరించారు. విధులు నిర్వహించే సమయంలో పక్కదారి పట్టిన అతడు.. తానేం చేయకూడదో అలాంటి దారుణాలకు పాల్పడ్డాడు. విధుల నిర్వహణలో భాగంగా కంగ్ చేతిలో అమెరికాలోనే మూడో అతి పెద్ద పెన్షన్ ఫండ్ ఉండేది. దాదాపు రూ.3.60 లక్షల కోట్ల స్థిరాదాయం వచ్చే సెక్యూరిటీల్లో ఆయన పెట్టుబడి పెట్టాల్సి ఉంది. కానీ..  కొన్ని కంపెనీల వారు ఆఫర్ చేసిన విలాసాలకు.. అమ్మాయిల వలలో పడిన అతడు.. నిధులను పక్కదారి పట్టించాడు.

గతంలో టెన్నిస్ క్రీడాకారుడైన కంగ్.. పలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో కూడా ఆడాడు. 2014 నుంచి రెండేళ్ల పాటు ఎన్ వైసీఆర్ఎఫ్ లో ఫిక్సెడ్ ఇన్ కమ్ విభాగపు డైరెక్టర్ గా వ్యవహరించేవారు. రెండు బ్రోకరేజ్ కంపెనీలు ఆయనపై వల వేసి.. భారీగా ముడుపులు.. తాయిలాలు ఇచ్చి ఆయన పక్కదారి పట్టేలా చేశారన్నది ఆయన మీద ఉన్న ఆరోపణ. తాజాగా ఆయన్ను ఓరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్ లాండ్ లో అరెస్ట్ చేశారు. ఫెడరల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఆయనతో పాటు.. బ్రోకరేజి ఉద్యోగుల్లో ఒకరైన కెల్లీ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. వీరిద్దరి మీద ఉన్న ఆరోపణలు కానీ రుజువైతే.. వీరిద్దరికి 20ఏళ్ల వరకూ జైలుశిక్ష పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉన్నతస్థానంలో పని చేసే అవకాశం వచ్చినప్పుడు.. పక్కదారి పట్టేలా వ్యవహరిస్తే చివరకు ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News