అప్ప‌ట్లోనూ ఇదే వ‌ర‌స.. కానీ, జ‌నం ఏం చేశారంటే..!

Update: 2022-08-06 23:30 GMT
నేత‌లు ఏం చేస్తున్నా.. జ‌నాలు కీన్‌గానే అబ్జ‌ర్వ్ చేస్తారు. ఈ విష‌యంలో త‌న మ‌న అనే తేడా లేదు. గ‌తంలో టీడీపీ అయినా.. ఇప్పుడు వైసీపీ అయినా.. పాల‌న ఎవ‌రిదైనా.. ప్ర‌జ‌ల అబ్జ‌ర్వేష‌న్‌లోనూ.. వారి నిర్ణ‌యంలోనూ.. ఎలాంటి మార్పూ ఉండ‌డం లేదు. ఇదే విష‌యం ఇప్పుడు వైసీపీని క‌ల‌వ‌ర‌పెడుతోంద‌ని అంటున్నారు సీనియ‌ర్లు. గ‌త ఎన్నిక‌ల మాదిరిగానే .. ఇప్పుడు కూడా రాష్ట్రంలో ప‌రిణామాలు మారుతున్నాయ‌ని చెబుతున్నారు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికార పార్టీ టీడీపీలో నాయ‌కులపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కొంద రు దూకుడుగా ఉన్నార‌ని.. మ‌రికొంద‌రు అవినీతి మ‌ర‌కలు అంటించుకున్నార‌ని కూడా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇవేవీ.. దాస్తే దాగేది కాదు. దీంతో క్షేత్ర‌స్థాయిలోనే పార్టీ లో స‌గం మందికి కూడా టికెట్లు ఇవ్వొద్ద‌ని.. కొత్త‌వారికి ఇవ్వాల‌ని.. డిమాండ్లు వ‌చ్చాయి. అయితే.. చంద్ర‌బాబు మాత్రం ఎవ‌రు ఎన్ని చెప్పినా.. త‌న ప‌నితాను చేసుకుని పోయారు.

టికెట్లు ఇచ్చిన త‌ర్వాత‌.. చేయించిన స‌ర్వేలో.. తీవ్ర ప‌రిణామాలు ఎదుర‌వుతున్నాయ‌ని.. ప్ర‌జ‌ల్లో ఆగ్ర హం క‌ట్ట‌లు తెగుతోందని నివేదిక‌లు వ‌చ్చాయి. దీంతో చేసేది లేక‌.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారం చేసి న చంద్ర‌బాబు ప్ర‌జ‌లకు ఒంగిఒంగి న‌మ‌స్కారాలు చేశారు. త‌న‌ను చూసి ఓటేయాల‌ని అన్నారు. త‌న పార్టీనాయ‌కులు.. చేసిన త‌ప్పుల‌ను.. త‌న‌ను  చూసి మ‌రిచిపోవాల‌ని కూడా కోరారు. కానీ.. జ‌రిగింది ఏంటో అంద‌రికీ తెలిసిందే.

ఇక‌, ఇప్పుడు కూడా అంత‌కు మించిన తేడా ఏమీలేద‌ని.. అంత‌కు ఒక మార్కు ఎక్కువ‌గానే అన్న‌ట్టుగా.. వైసీపీ నాయ‌కుల ప్ర‌వ‌ర్త‌న ఉంద‌నేది మెజారిటీ ప్ర‌జ‌ల టాక్‌. గ్రామ‌స్థాయిలో అయితే.. ఈ చ‌ర్చ మ‌రింత ఎక్కువ‌గానే జ‌రుగుతోంది. అంటే.. ఇప్పుడున్న ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ప్ర‌జ‌లకు న‌మ్మ‌కం సన్న‌గిల్లింది. దీంతో ఇప్పుడు గ‌తంలో మాదిరిగానే త‌న‌ను చూసి ఓటేయాల‌ని.. జ‌గ‌న్ అభ్య‌ర్థించే ప‌రిస్థితి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. అంటున్నారు.

అయితే.. జ‌గ‌న్ ఇమేజ్ కూడా కొన్ని కార‌ణాల‌తో డ్యామేజీ అవుతున్న ద‌రిమిలా.. ఆయ‌న చెప్పినా.. కూడా ప్ర‌జ‌లు వినిపించుకునే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. న‌న్ను చూసి గెలిపించండి.. అని జ‌గ‌న్ పిలుపునిచ్చినా.. ప్ర‌జ‌లు వింటారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింద‌ని.. చెబుతున్నారు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటిని సేమ్ సీన్ క‌నిపిస్తుందా?  లేక‌.. ఏదైనా భారీ సంచ‌ల‌నం చోటు చేసుకుంటుందా?  అనేది చూడాల్సి ఉంది.
Tags:    

Similar News