మ‌హానాడు జ‌న సంద్రం.... ఎక్క‌డెక్క‌డి నుంచో పోటెత్తిన జ‌నాలు

Update: 2022-05-28 15:30 GMT
ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో జ‌రుగుతున్న మహానాడు ప్రాంగణం జన సందోహంగా మారింది. ప్రాంగణం ఎదురుగా ఉన్న జాతీయ రహదారితోపాటు ఇతర రహదారుల్లో  ట్రాఫిక్ స్తంభించింది.

ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న కారు టైర్లలో గాలిని పోలీసులు తీసేస్తున్నారు. ఇటు మహానాడుకు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బయల్దేరారు. కారులో నుంచి ఆయన కార్యకర్తలకు అభివాదం చేస్తూ పెద్ద కాన్వాయ్‌తో ముందుకు సాగారు. లోకేష్‌తో పాటు పలువురు నేతలు మహానాడుకు బయల్దేరారు.

మహానాడుకు తరలివస్తున్న టీడీపీ కార్యకర్తలు, ప్రజలు  పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మహానాడు ప్రాంగణానికి చేరుకుంటామంటున్నారు టీడీపీ అభిమానులు.

జనం పెరిగిపోతుండడంతో అనుకున్న సమయానికంటే ముందుగానే సభను ప్రారంభించాలన్న ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. ఇక‌, ఈ క్ర‌మంలో యువ‌తులు., మ‌హిళ‌లు.. పెద్ద ఎత్తున మ‌హానాడుకు త‌ర‌లివ‌చ్చారు. కొంద‌రు సొంత వాహ‌నాలు వేసుకుని వ‌స్తుండ‌గా.. మ‌రికొంద‌రు.. పార్టీ నేత‌ల వాహ‌నాల‌పై కార్య‌క్ర‌మానికి వ‌స్తున్నారు.

ఒంగోలులో జరుగుతున్న మహానాడుకు చంద్రబాబు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ఆయనకు కార్యకర్తలు, అభిమానులు, అడుగడుగా ఘన స్వాగతం పలికారు. భారీ గ‌జ‌మాల‌ను క్రేన్‌తో తీసుకువ‌చ్చిన అభిమానులు ఆయ‌న‌కు అలంక‌రింప చేశారు.

మ‌రోవైపు కొంద‌రు అభిమానులు.. ప్ర‌త్యేకంగా రూపొందించిన వాహ‌నాలుతో మ‌హానాడుకు వ‌చ్చారు. పార్టీ నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు ఒంగోలు వీధుల్లో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. శ‌నివారం అన్న‌గారు.. ఎన్టీఆర్ 99వ పుట్టిన రోజు తో పాటు.. ఆయ‌న శ‌త‌జ‌యంతి కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి ప్ర‌జ‌లు పోటెత్తారు.
Tags:    

Similar News