మ‌ళ్లీ ర‌గులుతున్న `ఐల‌య్య‌` కుంప‌టి

Update: 2017-10-04 08:52 GMT
వివాదాస్ప‌ద ర‌చ‌యిత - ప్రొఫెస‌ర్ కంచె ఐల‌య్య రాజేసిన కులం కుంప‌టి ఇప్ప‌ట్లో ఆరేలా క‌నిపించ‌డం లేదు. పైగా ర‌గులుతోంది కూడా!  ‘సామాజిక స్మగ్ల‌ర్లు కోమ‌టోళ్లు’   శీర్షిక‌న ఆర్య వైశ్యుల పుట్టు పూర్వోత్త‌రాల‌తో ఐల‌య్య పేల్చిన బాంబు మంట‌లు ఏపీ - తెలంగాణ‌ల‌ను కాల్చేస్తున్నాయి. అయితే, దీనిపై ప్ర‌తి ఒక్క‌రూ ఆచి తూచి స్పందిస్తున్నారు. ఆర్య వైశ్య వ‌ర్గాలు బాహాటంగానే ఐల‌య్య‌కు వార్నింగులు ఇస్తుండ‌గా.. ఇత‌ర సామాజిక వ‌ర్గాల నేత‌లు మాత్రం చాలా జాగ్ర‌త్త‌గా వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఐల‌య్య పుస్త‌కాన్ని ఖండించ‌కుండా ఆయ‌న రాసిన కామెంట్ల‌ను మాత్ర‌మే ఖండించి మౌనం వ‌హించారు. ఇక‌, తెలంగాణ సీఎం కేసీఆర్ అసలు ఈ వివాదం వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ద‌ళిత వ‌ర్గాల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌నే ఆరోప‌ణ‌లు ఊపేస్తున్న క్ర‌మంలో ఐల‌య్య‌తో విభేదిస్తే.. మొత్తానికే దీపం ఆరిపోతుంద‌ని భావించిన కేసీఆర్‌.. సైలెంట్ అయిపోయారు. అయితే, ఇరు రాష్ట్రాల్లోని ఆర్య వైశ్యులు మాత్రం  త‌మ టాలెంట్ కొద్దీ ఐల‌య్య‌పై పోరు సాగిస్తూనే ఉన్నారు.

తాజాగా..  ఐల‌య్య‌ ఫొటోల‌తో క‌ర్నూలు పాత‌బ‌స్తీలో డోర్‌ మ్యాట్లను త‌యారుచేసి అమ్మ‌డం మ‌రింత క‌లక‌లం సృష్టించింది. ఐల‌య్య ఫొటోల‌ను ముద్రించిన కాళ్లు తుడుచుకునే ప‌ట్టాల‌ను  ఆర్య వైశ్యులే త‌యారు చేయించి అమ్మ‌కానికి పెట్టార‌ని ఐల‌య్య‌కు మ‌ద్ద‌తిస్తున్న సంఘాలు వీధుల్లోకి వ‌చ్చి పోరాటాల‌కు సిద్ధ‌మ‌య్యాయి.   ఎస్సీ - బీసీ సంఘాలు  వైశ్యుల దుకాణాల ముందు బైఠాయించి నిర‌స‌న తెలిపాయి. దీంతో వైశ్యులు పోటాపోటీగా నిర‌స‌న‌కు దిగారు.

తాము అటువంటి డోర్ మ్యాట్లు అమ్మడం లేదని చెప్పుకొచ్చారు. అంతేగాక‌, పెద్దఎత్తున ర్యాలీగా వెళ్లి కొండారెడ్డి బురుజు దగ్గర కాసేపు బైఠాయించి, అనంత‌రం ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. మొత్తంగా ఐల‌య్య వివాదా ఇప్పుడు యూట‌ర్న్ తీసుకోవ‌డంతో ఇది గాలివాన రేంజ్ నుంచి తుఫును.. పెను విప‌త్తుగా మారే ప‌రిస్థితి ఏర్ప‌డేలా ఉంద‌ని, ఇప్ప‌టికైనా ఏపీ - తెలంగాణ సీఎంలు క‌లుగ జేసుకుని ప‌రిష్కారం దిశ‌గా అడుగులు వేయాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు.
Tags:    

Similar News