మిడ‌త‌లు క‌నిపిస్తే ప‌ట్టేయండి.. క‌మ్మటి బిర్యానీ వండుకుని తినొచ్చు

Update: 2020-05-30 07:10 GMT
ఎడారి దేశాల నుంచి దేశంలోకి మిడతల దండు ప్ర‌వేశించింది. అవి పంట‌పొలాలు నాశ‌నం చేస్తాయ‌ని తెలిసి రైతులు వాటిని తరిమి కొట్టేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. డీజే సౌండ్లు, రసాయనాలు చల్లి వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్ర‌స్తుతం మిడ‌త‌ల వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. అయితే ఈ మిడ‌త‌ల‌ను మ‌నం తిన‌వ‌చ్చు తెలుసా. అది కూడా బిర్యానీ వండుకుని మ‌రి లాగించేయొచ్చు అని రాజ‌స్థాన్‌ వాసులు చెబుతున్నారు.

ఇప్ప‌టికే రాజస్థాన్‌లో ప్ర‌వేశించి బీభ‌త్సం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇంకా మిడ‌త‌ల దండు దండ‌యాత్ర చేస్తూనే ఉంది. అయితే రాజ‌స్థాన్ ప్రజలు ఇదే అదును మిడ‌త‌ల‌ను ప‌ట్టేసి బిర్యానీ వండుకుని తినేస్తున్నారు. బిర్యానీతో పాటు వివిధ ర‌కాల వంట‌కాలు చేస్తూ భోజ‌నంలో భాగం చేస్తున్నారు. మిడతలతో అ‌క్క‌డి రెస్టారెంట్లు, హోట‌ళ్లు బిర్యానీ, వేపుళ్లు (ఫ్రై), కూరలు చేస్తున్నారు. మిడ‌త‌లో చేసిన బిర్యానీకి మకాడ్ బిర్యానీ అని పేరు పెట్టి విక్ర‌యిస్తున్నారు. రాజ‌స్థాన్‌లోని ధార్, జైపూర్ త‌దిత‌ర ప్రాంతాల్లోని హోట‌ల్‌ల‌లో ఇవి అందుబాటులోకి వ‌చ్చాయి. ప్లేటు బిర్యానీ రూ.200కు విక్రయిస్తున్నారు.

మిడతలు చాలా రుచిగా ఉంటాయని, అందులో బోలెడన్నీ ప్రోటీన్లు ఉంటాయని ఈ సంద‌ర్భంగా ఓ రెస్టారెంట్ య‌జ‌మాని చెబుతున్నాడు. మిడతలను ఉడికించే ముందు బాగా శుభ్రం చేయాలని, దాని కాళ్లు, రెక్కలను తొలగించాలి వండ‌డానికి ముందు చేయాల్సిన ప‌నులు చెప్పాడు. పాకిస్థాన్‌లో మాత్రం మిడ‌త‌ల‌ను బాగా తింటారు. స‌రిహ‌ద్దు దేశం కాబ‌ట్టి ఆ భోజ‌న విధానం రాజస్థాన్ వారికి అల‌వాటైంది. పాకిస్థాన్‌లోని ఛచ్రో ప్రాంతంలో మిడతలను బాగా వేయించి.. వాటిపై కరివేపాకులు చల్లి స్నాక్స్‌లా తినేస్తున్నారు.

దీంతోపాటు చైనావాళ్లు మిడ‌త‌లతో ఏం చేస్తున్నారో యూట్యూబ్‌లో నెటిజ‌న్లు చూస్తూ షాక్‌కు గుర‌వుతున్నారు. చైనావాళ్లు ఏ జంతువు, కీట‌కాన్ని వ‌దిలేయ‌రు క‌దా అని పేర్కొంటున్నారు.
Tags:    

Similar News