తాజాగా విడుదలైన ఒక రిపోర్టు.. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న అంతరాల్ని కళ్లకు కట్టినట్లుగా చూపించటమే కాదు.. ఇదే తీరులో సాగితే.. గుప్పెడు మంది చేతుల్లోకి యావత్ ప్రపంచం వెళ్లిపోతుందా? అన్న భావనకు గురి కావటం ఖాయం.
ప్రపంచవ్యాప్తంగా తారతమ్యాలు అంతకంతకూ పెరిగిపోతున్న వైనాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించిన ఈ రిపోర్టు ఆనందం కంటే ఆందోళనకు గురి చేయటం ఖాయం. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రాఫిటింగ్ ఫ్రం పెయిన్ పేరుతో ఆక్స్ ఫామ్ రిపోర్టును విడుదల చేసింది.
అందులో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాల్ని వెల్లడించారు. కరోనా వేళ.. ప్రతి 30 గంటలకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకొస్తే.. అందుకు ప్రతిగా ప్రతి 33 గంటలకు దాదాపు 10 లక్షల మంది కడు పేదరికంలోకి జారుకోనున్నట్లుగా వార్నింగ్ ఇచ్చేసింది. గడిచిన కొన్ని దశాబ్దాల్లోఎప్పుడూ లేనంత వేగంగా నిత్యవసరాల ధరలు పెరిగిన వైనాన్ని వెల్లడించింది. ఆహారం.. ఇంధన రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తల సంపద ప్రతి రెండురోజులకు ఒకసారి బిలియన్ డాలర్ల చొప్పున పెరిగినట్లుగా రిపోర్టు స్పష్టం చేసింది.
కరోనా కష్టకాలంలో కోట్లాది మంది తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటే.. అందుకు భిన్నంగా కొందరు తమ సంపదను భారీగా పెంచుకున్న వేళ.. వారంతా దావోస్ కు ఉత్సాహంగా పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఇంతకూ నివేదికలో పేర్కొన్న కీలక అంశాల్ని చూస్తే..
- ప్రపంచ జనాభాలో శిఖర స్థాయిలో ఉన్న ఒక శాతం మందికి సంబంధించిన ఒక వ్యక్తి ఏడాది సంపాదనకు సమానంగా సంపాదించాలంటే దిగు 50 శాతానికి చెందిన కార్మికుడు ఏకంగా 112 ఏళ్లు పని చేయాల్సి ఉంటుంది.
- ధనిక దేశాలతో పోలిస్తే పేద దేశాల్లోని ప్రజలు ఆహారం కోసం తమ ఆదాయంలో రెట్టింపు మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు.
- కరోనా ప్రారంభ సంవత్సరమైన 2020లో 573 మంది కొత్తగా బిలియనీర్లుగా అవతరించారు. అంటే.. ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్ పుట్టుకొచ్చారన్న మాట. అదే ఏడాది 26.3 కోట్ల మంది పేదరికంలోకి జారిపోయారు. అంటే ప్రతి 33 గంటలకు పది లక్షల మంది పేదరికంలోకి జారిపోయారు.
- కరోనా సంక్షోభం మొదలైన 24 నెలల్లో బిలియనీర్లు ఆర్జించిన సంపద మొత్తం వారి 23 ఏళ్ల సంపాదనకు అధికం కావటం గమనార్హం.
- ఇంధనం.. ఆహారం.. ఫార్మా రంగాలకు చెందిన కంపెనీల్లో గుత్తాధిపత్యం కలిగిన కంపెనీలు రికార్డు లాబాల్ని సొంతం చేసేసుకున్నారు. కానీ.. వాటిల్లో పని చేసే వారి వేతనాలు మాత్రం స్వల్పంగానే పెరిగాయి.
- ప్రపంచంలో అతి పెద్ద ఇంధన కంపెనీలైన షెల్.. బీపీ.. టోటల్ ఎర్జీస్.. ఎక్సాస్.. షెవ్రాన్ కంపెనీల మొత్తం లాభం ప్రతి సెకనుకు 2600 డాలర్లుగా ఉండటం విశేషం.
- కరోనా పుణ్యమా అని ఫార్మా రంగంలో 40 మంది బిలియనీర్లు (కనీసం రూ.7750 కోట్ల సంపద కలిగిన వారిని బిలియనీర్లుగా వ్యవహరిస్తారు)గా అవతరించారు. మోడెర్నా.. ఫైజర్ లాంటి బడా ఔషధ కంపెనీలు ప్రతి సెకనుకు వెయ్యి డాలర్ల లాభాన్ని ఆర్జించారు.
- అల్పాదాయ దేశాల్లోని 87 శాతం మంది ప్రజలకు ఇప్పటికి రెండో డోసు కొవిడ్ టీకా అందలేదు.
- కొవిడ్ కారణంగా గడిచిన రెండేళ్లలో 2 కోట్ల మందికి పైనే దీని బారిన పడి మరణించారన్నది ఒక అంచనా.