ఒక్కో భార‌తీయుడి నెత్తి మీద రూ.44095 అప్పు!

Update: 2015-07-26 09:39 GMT
మీరు పైసా అప్పు చేయ‌రా? ఉన్న‌దాంట్లో స‌ర్దుకొని బ‌తికేస్తుంటారా? అయిన‌ప్ప‌టికీ మీకు అప్పున్న‌ట్లే. ఎందుకిలా అంటే.. అభివృద్ధి కార్య‌క్ర‌మాల కోసం భార‌త‌దేశం బ‌య‌ట దేశాల నుంచి తెచ్చిన అప్పును దేశ జ‌నాభాకు పంచితే..ఒక్కొ త‌ల మీద ప‌డే భారం అక్ష‌రాల రూ.44,095గా తేలింది. అది ప‌సికందులు మొద‌టు వ‌డ‌లిపోయిన వృద్ధుల వ‌ర‌కూ అంద‌రి మీదా ఇంత మొత్తం అప్పు నెత్తి మీద ఉంది.

తాజాగా ప్ర‌పంచ బ్యాంక్ విడుద‌ల చేసిన అంత‌ర్జాతీయ రుణ గ‌ణాంకాల ఆధారంగా ఒక్కో భార‌తీయుడి మీద  ఇంత అప్పు ఉన్న‌ట్లుగా తేలింది. మొత్తంగా భార‌తదేశం అప్పు.. రూ.68.95లక్ష‌ల కోట్లు ఉన్న‌ట్లుగా తేల్చారు.
దేశంలో అభివృద్ధి ఎంత జ‌రిగింద‌న్న‌ది త‌ర్వాత విష‌యం.. గ‌త ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాదికి అప్పు మాత్రం కాస్త పెరిగిన‌ట్లుగా తేల్చారు.  గ‌త ఏడాది విడుద‌ల చేసిన గ‌ణాంకాల ప్ర‌కారం..రూ.41,129 కాగా.. గ‌త ఏడాదిగా తీసుకున్న అప్పుల పుణ్య‌మా అని ఒక్కో భార‌తీయుడి నెత్తి మీద రూ.2966 మేర అప్పు భారం పెరిగింద‌ని తేల్చారు.

మీరు జాగ్ర‌త్త‌గా ఉంటే స‌రిపోదు.. ప్ర‌జ‌ల్ని పాలించే ప్ర‌భుత్వాలు జాగ్ర‌త్త‌గా లేకున్నా.. ఇలా అప్పుల భారం పెరిగి.. ప‌న్నుల రూపంలో తాట తీయ‌టం ఖాయం. అందుకే.. దేశం ఎలా పోయినా ప‌ర్లేదు లాంటి మాట‌ల వ‌ల్ల న‌ష్ట‌మే కానీ లాభం ఉండ‌దు. అంద‌రూ అలా వ‌దిలేస్తూ పోతే.. అప్పుల భారం మ‌రింత పెర‌గ‌టం ఖాయం. సో.. బీకేర్‌ఫుల్‌.
Tags:    

Similar News