అచ్చెన్నా పెద్ద అనకొండనట..తవ్వేకొద్దీ బయటపడుతున్నాయే

Update: 2020-02-25 17:30 GMT
ఏపీలో మరో కలకలం వెలుగులోకి వచ్చింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్రతో తెలంగాణ ఈఎస్ఐ తరహాలో ఆంధ్రప్రదేశ్‌ ఈఎస్‌ఐలోనూ భారీ కుంభకోణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. అయితే,దీనికి కొనసాగింపుగా మరిన్ని అంశాలను సాక్షి మీడియా ఓ ప్రత్యేక కథనంలో వెల్లడించింది. ఈఎస్‌ఐ లేని కంపెనీలు నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్లు తేల్చారనే రీతిలో... టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తుపాను సహా అనేక అంశాల్లో అవకతవకలకు పాల్పడ్డారని పేర్కొంది.


తిత్లీ తుఫాన్‌ పరిహారం పంపిణీ, నీరు చెట్టు పథకంలో వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించింది. ఏదో ఒక సర్వే నెంబర్‌ తో భూమిని చూపించి, నచ్చినంత సంఖ్యలో చెట్లు పడి పోయినట్టు నమోదు చేయించుకుని కోట్లాది రూపాయల పరిహారాన్ని మింగేశారని సాక్షి కథనం ఆరోపించింది. అచ్చెన్నాయుడు, అడుగు జాడల్లో మరో ఎమ్మెల్యే కలిసి..వారిద్దరికీ చెంది ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా పరిహారాన్ని స్వాహా చేశారని ఆరోపించింది. నీరు‌‌–చెట్టు పనుల్లో భాగంగా రూ.5 లక్షల విలువ కన్నా ఎక్కువగా ఉండే పనుల కాంట్రాక్ట్‌లను తమ అనుయాయులకు నామినేటెడ్‌ పద్ధతిలో కట్టబెట్టారు. జిల్లాలో రూ.427.24 కోట్ల విలువైన 5696 పనుల్లో అత్యధికం అలా దక్కించుకున్నవే. వీటిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. పనులు సక్రమంగా సాగలేదు. మట్టి తవ్వకాల కింద క్యూబిక్‌ మీటర్‌కు రూ.29కు గాను రూ.82.80 చెల్లించారు. చెరువు గట్లపై మట్టిని గట్టి పరచకుండా, ఉన్న దాని కంటే అధికంగా నమోదు చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. నిబంధనల ప్రకారం 50 ఎకరాలు ఆయకట్టు పైబడిన చెరువుల్లో మాత్రమే నీరు చెట్టు పనులు చేపట్టాలి. కానీ అందుకు భిన్నంగా 50 ఎకరాలు కంటే తక్కువ ఉన్న చెరువుల్లో కూడా పనులు నిధులు దురి్వనియోగం చేశారు. కంచిలి, కవిటి మండలాల్లో ఎక్కువగా ఈ రకమైన అక్రమాలు జరిగాయి. భూముల్లేకపోయినప్పటికీ పరిహారం పొందిన వారు మ్యూటేషన్‌ చేయించి, పట్టాదారు పాసు పస్తకాలను తయారు చేయించారని ప్రస్తావించింది.

తిత్లీ తుఫాను పరిహారాన్ని అప్పనంగా కాజేసిన తెలుగు తమ్ముళ్లు దర్యాప్తు లో బయటప డకుండా ఉండేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలు వేశారని అయితే, ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం రావడం, అక్రమాలపై లిఖితపూర్వక ఫిర్యాదులు రావడం, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిహారాన్ని పెంచడంతో అక్రమాల డొంక కదిలిందని ప్రస్తావించింది. కాగా, . కింజరాపు కుటుంబ సభ్యుల అక్రమ ఆస్తులను ఆధారాలతో సహా బహిర్గతం చేయడానికి మార్చి 2న టెక్కలి అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద బహిరంగ చర్చా వేదిక నిర్వహిస్తామని...అచ్చెన్నాయుడుకు దమ్ముంటే చర్చా వేదికకు వచ్చి తన నిజాయితీ నిరూపించుకోవాలని వైఎస్సార్‌ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ స‌వాల్ విసిరారు. మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన అక్రమాలు, అవినీతి కార్యకలాపాలపై ఆధారాలతో సహా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి లేఖ అందజేస్తున్నామని ప్ర‌క‌టించారు.


Tags:    

Similar News