పురుషుడికి పీరియడ్స్.. ఏంటీ వింత ఘటన.. అసలేమైందంటే?

Update: 2022-07-11 02:30 GMT
చైనాలో వింతఘటన చోటుచేసుకుంది. ఒక పురుషుడికి పీరియడ్స్ రావడం చూసి అంతా అవాక్కవుతున్నారు. 20 ఏళ్లుగా ఓ పురుషుడికి రుతుక్రమం అవుతోంది.  మూత్రంలో రక్తం, తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వైద్యుడి వద్దకు వెళ్లాడు. ఆ వ్యక్తికి షాకింగ్ విషయం తెలిసింది. అతడికి గర్భాశయం ఉన్నట్లు వైద్యులు తేల్చారు.  అండాలు విడుదలవుతున్నట్లు గుర్తించారు. జీవశాస్త్రపరంగా అతడు మహిళ అని నిర్ధారించారు.

నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లోని చెన్ లీ అనే వ్యక్తికి 20ఏళ్లుగా మూత్రంలో రక్తం వస్తున్నది. ప్రస్తుతం అతడి వయసు 33 ఏళ్లు. యుక్త వయసులో ఉన్నప్పుడు మూత్రవిసర్జన సమస్య ఉండడంతో ఆపరేషన్ చేయించుకున్నాడు.అప్పటి నుంచి అతడికి మూత్రంలో రక్తంతోపాటు సాధారణ పొత్తికడుపు నొప్పి వస్తున్నది. ఇటీవల కడుపునొప్పి నాలుగు గంటలకు పైగా కొనసాగడంతో డాక్టర్ ను సంప్రదించాడు. డాక్టర్ అతడికి అపెండిసైటిస్ అని నిర్ణారించారు. ఆపరేషన్ చేసినా అతడికి కడుపునొప్పి తగ్గలేదు.

వైద్యులు అతడికి స్కానింగ్ తీయగా..షాకింగ్ విషయం బయటపడింది. చైనా వ్యక్తికి గర్భాశయం, అండాశయాలతో సహా స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నాయని తేలింది. అలా మగ సెక్స్ హార్మోన్లు ఆండ్రోజెన్ స్థాయిలు సగటు కంటే తక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఆడ సెక్స్ హార్మోన్లు, అండాశయ కార్యకలాపాల స్థాయిలు ఆరోగ్యకరమైన వయోజన మహిళల్లో ఎలా ఉంటాయో అలాగే ఉన్నట్లు కనుగొన్నారు.

చెన్ లీకి ఏకంగా ఆడ, మగ పునరుత్పత్తి అవయవాలతోపాటు ఇంటర్ సెక్స్ లో జన్మించారని వైద్యులు నిర్ధారణకు వచ్చారు.  అందుకే అతడి మూత్రంలో రక్తం, కడుపునొప్పి అనేది రుతుక్రమం వల్ల వచ్చిందే అని తేల్చారు. ఈ విషయం తెలిసి లీ చాలా బాధపడ్డారు.

అందుకే తాను మగాడిగానే ఉంటానని.. స్త్రీ పునరుత్పత్తి అవయవాలను తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. గత నెలలో అతడికి స్పెషలిస్ట్ ఆస్పత్రిలో మూడు గంటల పాటు ఆపరేషన్ చేయించుకొని విజయవంతంగా తొలగించుకున్నాడు. మగాడిగానే మారాడు. 20 ఏళ్లుగా ఇలా జరుగుతున్నా అతడు గుర్తించలేదు. చివరికి ఆపరేషన్ చేయించుకొని వాటిని తొలగించుకున్నాడు. 20 ఏళ్లుగా ఇలా జరుగుతున్నా అతను గుర్తించలేదు. చివరకు ఆపరేషన్ చేయించుకొని వాటిని తొలగించుకున్నాడు.
Tags:    

Similar News