బాల‌య్య‌ను అడ్డంగా ఇరికించేసిన మంత్రి పేర్ని!

Update: 2022-02-26 09:30 GMT
న‌ట‌సింహం, అఖండ‌.. నంద‌మూరి బాల‌య్యను ఓ రేంజ్‌లో ఏకేశారు మంత్రి పేర్ని నాని. ఆయ‌న‌కు ము హూర్తాల పిచ్చింద‌ని.. ఆయ‌న వ‌ల్ల త‌న స‌మ‌యం కూడా వేస్ట‌యింద‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు ..జ‌గ‌న్ త‌న‌కు అప్పాయింటె్ ఇచ్చార‌ని.. అయినా తాను వెళ్ల‌లేద‌ని గ‌తంలో బాల‌య్య చెప్పిన వ్యాఖ్య‌ల‌ను మం త్రి పేర్ని ఖండించారు. అస‌లు బాల‌య్య అప్పాయింట్ మెంట్ గురించి త‌న‌తోనే మాట్లాడిన‌ట్టు చెప్పారు.  అయితే.. ఈ క్ర‌మంలో బాల‌య్య‌కు ఉన్న ముహూర్తాల పిచ్చి త‌న‌కు అర్ధం అయింద‌ని అన్నారు.

మంత్రి ఏమ‌న్నారంటే...

"అఖండ సినిమా విడుదలకు ముందు ఆ సినిమా నిర్మాతలు నన్ను కలవడానికి ప్రయత్నించారు. అది కూడా వెంటనే కలవరట. వాళ్లకు 2-3 తేదీలు, టైమింగ్స్ ఇవ్వాలంట. వాటిలోంచి ఆ హీరోగారు ఒకటి నిర్ణయిస్తారట. ఇదేదో విచిత్రంగా అనిపించింది నాకు. అయినప్పటికీ వాళ్ల కోసం నేను 2-3 డేట్స్ ఇచ్చాను. అందులో ఒక డేట్, టైమ్ ముహూర్తం చూసుకొని, నిర్మాతలు విజయవాడలోని ప్రభుత్వ అతిథి గృహంలో నన్ను కలిశారు`` అని పేర్ని చెప్పారు.

అయితే.. ఆ భేటీకి బాల‌య్య నేరుగా హాజ‌రు కాలేద‌ని.. మంత్రి వివ‌రించారు. బాల‌య్య త‌న‌తో ఫోన్‌లో మాట్లాడ‌తార‌ని.. నిర్మాత‌లే చెప్పారని అన్నారు. ``దీంతో స‌రే అన్నా. అయితే.. చిత్రంగా బాల‌య్య‌కు వాళ్లు నేరుగాఫోన్ చేయ‌కుండా.. మిస్‌డ్ కాల్ చేసి క‌ట్ చేశారు. అదేంటి? అని ఆశ్చ‌ర్య పోయా. ఎవ‌రైనా ఫోన్ చేస్తే..నేరుగా మాట్లాడ‌కుండా.. మిస్డ్ కాల్ వ్య‌వ‌హారం ఎందుకు.. మాట్లాడొచ్చు క‌దా!`` అని మంత్రి ప్ర‌శ్నించార‌ట‌.

జ‌గ‌న్ వ‌ద్ద‌న్నారు!

దీనికి నిర్మాత‌లు బ‌దులిస్తూ.. ``బాల‌య్య అంద‌రిలాగా కాదు.. ఆయ‌న మంచి మూహూర్తం ఉంటేనే మాట్లాడ‌తారు!`` అని నిర్మాత‌లు చెప్పిన‌ట్టు పేర్ని వెల్ల‌డించారు. అంతేకాదు.. ``నాతో మాట్లాడ్డానికి కూడా ఆయన ముహూర్తం పెట్టుకున్నారు. మొత్తానికి ఓ ముహూర్తం చూసుకొని, బాలయ్య నాతో మాట్లాడారు. నేను సీఎంను కలుస్తాను, అపాయింట్ మెంట్ కావాలని స్వయంగా నన్ను అడిగారు. నేను సీఎం జగన్‌కి అదే విషయం చెప్పాను. బాలయ్య వచ్చి కలుస్తానంటున్నారని అన్నాను. తన దగ్గరకు బాలయ్య వస్తే బాగోదని స్వయంగా జగన్ వారించారు. ఆయనకు ఏం కావాలో అది చేసి పెట్టమని నన్ను ఆదేశించారు. పెద్దమనిషి ఎవ‌రో ఇప్పుడు చెప్పండి. ఎవరిది పెద్దరికం. బాలయ్య అబద్ధాలు ఆడతారని నేను ఎప్పుడూ అనుకోలేదు`` అని పేర్ని వ్యాఖ్యానించారు.

ఈ ప‌రిణామంతో ఇటు టీడీపీ, అటు బాల‌య్య‌ఫాన్య్ కూడా డిఫెన్స్‌లో ప‌డిపోయిన‌ట్టు అయిపోయింది.   అఖండ రిలీజ్ టైమ్ లో ప్రభుత్వం అడ్డుకుందనే ప్రచారాన్ని కూడా మంత్రి పేర్ని తిప్పికొట్టారు. అఖండ సినిమా టైమ్ లో ప్రభుత్వం వేధించిందని బాలయ్య చెబితే, తను బహిరంగంగా క్షమాపణలు చెబుతానన్నారు. దీంతో ఇప్పుడు బాల‌య్య‌ను పూర్తిగా ఇరికించేసిన‌ట్టు అయిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనిపై బాల‌య్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News