సినిమా టికెట్ల అమ్మకానికి ప్రభుత్వమే ప్రత్యేకంగా వెట్ సైట్ పెట్టబోతోందనే విషయంలో మంత్రి పేర్నినాని అసలు విషయాన్ని బయటపెట్టేశారా ? మంత్రి మీడియా సమావేశం తర్వాత అందరిలోను ఇదే విషయమై క్లారిటి వచ్చినట్లే ఉంది. సినిమా టికెట్ల అమ్మకం కోసం ప్రభుత్వం ఓ వెబ్ సైట్ ను ఏర్పాటు చేయటం కోసం ఓ కమిటిని ఏర్పాటు చేస్తు ఈ మధ్యనే ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై చంద్రబాబునాయుడుతో పాటు ఆయనకు మద్దతిచ్చే మీడియా విపరీతమైన బురద చల్లేస్తోంది.
అయితే తాజాగా పేర్నినాని మీడియా సమావేశం పెట్టి మరీ అసలు విషయం చెప్పేశారు. అదేమిటంటే ప్రభుత్వమే ఆన్ లైన్లో టికెట్లు అమ్మాలని సినీపెద్దలే ప్రభుత్వానికి సూచించినట్లు మంత్రి చెప్పారు. సినీ పెద్దల సూచన మేరకే ప్రభుత్వం ఓ కమిటిని నియమించిందట. టికెట్ల విషయంలో పన్నులు ఎగొడుతున్నారని ప్రభుత్వం కూడా గ్రహించిందట. టికెట్లను బ్లాకులో అమ్మకాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
నిజానికి సినిమా టికెట్ల అమ్మకం కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా వెబ్ సైట్ ఏర్పాటు చేయటాన్ని సిని పరిశ్రమలోని చాలామంది సానుకూలంగానే ఉన్నారు. నిజానికి ప్రభుత్వ నిర్ణయాన్ని నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు ఇలా.. ఎవరు కూడా ఇంతవరకు వ్యతిరేకించలేదు. పైగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తు కొందరు ప్రకటనలు కూడా చేశారు. ఇక్కడ సమస్య ఎవరికైనా వస్తుందని అనుకుంటే అది కేవలం ఎగ్జిబిటర్లు మాత్రమే.
మరిలాంటి నిర్ణయంపై టీడీపీ మద్దతు మీడియా విపరీతమైన కథనాలు వండి వారుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమ దెబ్బ తినేస్తోందన్నట్లుగా బురద చల్లేస్తోంది. మళ్ళీ ఇలాంటి నిర్ణయమే తీసుకున్న తెలంగాణా ప్రభుత్వం విషయంలో మాత్రం ఒక్కటంటే ఒక్క వార్త కూడా రాసే ధైర్యం చేయలేకపోతోంది. ఈ నేపధ్యంలోనే మంత్రి మీడియా సమావేశం ద్వారా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సినీపెద్దల సూచనలే కారణమని అర్ధమవుతోంది. మరిపుడు సినీపెద్దలు ఏమి చెబుతారో వాళ్ళ సూచనలపై ఈ మీడియా ఏమంటుందో చూడాలి.