ఎమ్మెల్యేల జాతకాల మీద పేర్ని నాని సంచలన‌ కామెంట్స్...?

Update: 2022-07-09 15:30 GMT
నిన్నటిదాకా వైసీపీలో కీలక మంత్రిగా ఉన్న పేర్ని నాని ప్లీనరీ వేదికగా మాట్లాడుతూ అనేక పంచ్ డైలాగులు పేల్చారు. అందులో నూటికి తొంబై శాతం ప్రత్యర్ధి పార్టీలకు తగిలాయి. కానీ మిగిలిన పది శాతం వైసీపీ అధినాయకత్వానికి కూడా ఇండైరెక్ట్ గా తగిలింది అంటున్నారు. వెటకారం డాట్ కమ్ కి పెట్టింది పేరు అని పేర్ని నాని నవ్వుతూనే అలా అంటించేస్తారు.

దాంతో ఆయన విసిరిన సెటైర్లను జగన్ సైతం నవ్వుతూ ఆస్వాదించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే పేర్ని నాని చెప్పినది ఏంటి అంటే కార్యకర్తలు ఎందుకు నిరుత్సాహపడుతున్నారు, మీకు కావాల్సింది జగన్ కదా. ఆయనతోనే మీ బంధం కదా అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అన్న వారు వస్తూంటారు, పోతూంటారు, శాశ్వతం ఎపుడూ కార్య్కర్తలు అని ఆయన అన్నారు.

జగన్ సీఎం కావాలని, ఆయన కొనసాగాలని గట్టి పట్టుదల మీకు ఉంటే మధ్యలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ఎందుకు కోపాలు అని కూడా ప్రశ్నించారు. మేము సరిగ్గా పనిచేయకపోతే పీకేయడానికి జగన్ రెడీగా ఎపుడూ ఉంటారని ఆయన చేసిన కామెంట్స్ ప్లీనరీలోనే హైలెట్ గా నిలిచాయి. ఏప్రిల్ 7 వరకూ నేను మంత్రిని, 11 నాటికి కొత్త మంత్రులు వచ్చేశారు, నేను మాజీని అయ్యాను. ఇదంతా చూశారు కదా అని ఆయన అన్నారు.

అలాగే ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాను, జగన్ మా అందరికీ ఎనిమిది నెలల టైమ్ ఇచ్చారు. మా పెర్ఫార్మెన్స్ బాగా లేదు అని తెలిస్తే మా జాతకాలు ఆయన తేల్చేస్తారు. మాకు టికెట్ ఇవ్వరు అని కూడా పేర్ని నాని కుండబద్ధలు కొట్టేశారు. దాంతో జగన్ లిస్ట్ లో ఎవరు ఉన్నారో అన్న చర్చ కూడా మొదలైంది. నిజానికి ప్లీనరీ వేదికగాఎంపిక చేసిన చోట్ల కొందరు  కొత్త అభ్యర్ధుల ప్రకటన చేయాలని పార్టీ మొదట భావించిందిట.

అయితే విజయమ్మ రాజీనామా చేయడం, రాంగ్ టైమ్ లో ఆమె చేసిన ప్రకటన కాస్తా బూమరాంగ్ అయి పార్టీకి తలనొప్పులు తెచ్చి పెట్టిందని అంటున్నారు. దాంతో విపక్షాలకు అది అస్త్రంగా మారిపోయింది. దాంతో ఆ గొడవ అలా ఉండగానే ఇపుడు లిస్ట్ బయటకు తీస్తే మొత్తానికి మొత్తం ప్లీనరీ సంబరమే చెడిపోతుందని భావించే అలా చేశారు అంటున్నారు.

మొత్తానికి చూస్తే పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు జగన్ మీదనే అని అంటున్నారు. మాజీ మంత్రిగా ఉండడం పట్ల నాని నొచ్చుకుంటున్నారు అని ఇప్పటికే కధనాలు వచ్చాయి. ఇక చాన్స్ వచ్చింది కాబట్టి ప్లీనరీ వేదికగా ఆయన తన ఆవేదనను బయటపెట్టుకున్నారు అని అంటున్నారు. మా పదవులు శాశ్వతం కాదు అంతా జగన్ దయ అన్నట్లుగా పేర్ని నాని చేసిన కామెంట్స్ ని మెజారిటీ వైసీపీ నేతలు అంగీకరిస్తున్నారు.
Tags:    

Similar News