ఎజెండా ఒక్కటే అయినా వేర్వేరు జెండాలతో ఏపీ అధికారపక్షంపై పోరాడుతున్నాయి టీడీపీ.. జనసేన. ఏపీలో బాబుకున్న విలువ ఏపాటిదన్న విషయం ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. పవన్ కు ప్రజల్లో ఉన్న పట్టు ఏపాటిదన్న విషయాన్ని ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఆయన్ను ఓడించటంద్వారా ప్రజలు తేల్చేశారు. అయినప్పటికీ మొండిగా వ్యవహరిస్తూ జగన్ ప్రభుత్వంపై అదే పనిగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్ కల్యాణ్.
ఇటీవల కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ వర్సెస్ పవన్ కల్యాణ్ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం తెలిసిందే. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్నీ నాని పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమాలో నటిస్తే పవన్ కు ఎంతిస్తారు? మహా అయితే రూ.50 కోట్లు. అంతకు మించి ఇచ్చే అవకాశం లేదు. కానీ.. పొలిటికల్ మూవీలో చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ను పొల్లుపోకుండా చదవటం ద్వారా భారీ ప్రయోజనాన్ని పొందినట్లుగా ఆరోపించారు.
గత ఎన్నికల సమయంలో జగన్ పార్టీ ఓటును చీల్చేందుకు బాబుతో పవన్ డీల్ మాట్లాడుకున్నట్లు వ్యాఖ్యానించారు. రూ.450 కోట్ల భారీ మొత్తాన్ని తన పొలిటికల్ పారితోషికాన్ని పవన్ తీసుకున్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు తనకిచ్చిన భారీ పారితోషికానికి తగ్గట్లే పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని.. అందుకు తగ్గట్లే తమపై విరుచుకుపడుతున్నట్లు పేర్ని నాని మండిపడ్డారు.