కరోనా అనుమాన రోగి మృతి .. భారీ భద్రత మధ్య అంత్యక్రియలు !

Update: 2020-03-05 08:30 GMT
కరోనా వైరస్ సోకిందేమో అన్న అనుమానంతో ఐసోలేషన్ వార్డ్ లో ప్రత్యేక చికిత్స తీసుకుంటూ మృతి చెందిన కరోనా అనుమానిత రోగి అత్యంత భారీ భద్రత మధ్య అత్యంక్రియలు నిర్వహించిన సంఘటన కేరళ రాష్ట్రంలోని పయ్యన్నూర్ పట్టణంలో జరిగింది.

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా .. ప్రస్తుతం భారత్ లో పంజా విసరడం మొదలు పెట్టింది. భారత్ లో కూడా కరోనా అనుమానిత కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే కేరళ రాష్ట్రం , పయ్యన్నూర్ పట్టణానికి చెందిన వ్యక్తి తీవ్రమైన జ్వరం, జలుబు తో ఇటీవల మలేషియా నుండి కేరళ కి వచ్చాడు. అయితే , అతడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో ..ఎయిర్ పోర్ట్ లోనే అతనికి కొన్ని వైద్య పరీక్షలు చేసి ... అటునుండి అటే ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే , కరోనా అనుమానంతో హాస్పిటల్ లో చేరిన జైనేష్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. జైనేష్ రక్తనమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరీక్షించగా అతనికి కరోనా వైరస్ లేదని తెలిసింది.

అయితే , జైనేష్ కరోనా వైరస్ సోకిందేమో అన్న అనుమానం తో హాస్పిటల్ లో చేరడం , అలాగే ఐసోలేషన్ వార్డ్ లో చికిత్స తీసుకోవడం తో అతనికి కరోనా వైరస్ లేదు అని తేలినప్పటికీ , కరోనా ఉందనే అనుమానం తో అతని మృతదేహాన్ని పలు పొరల వస్త్రంతో పాటుగా, పాలిథీన్ కవర్ల లో చుట్టారు. అలాగే కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి జైనేష్ మృత దేహాన్ని రెండు మీటర్ల దూరం నుంచే కడచూపు చూసేందుకు పదినిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు. ఆ తరువాత వారి ఆచార వ్యవహారాల్ని పాటించకుండా .. కట్టుదిట్టమైన భద్రత మధ్య పలు పొరల పాలిథీన్ కవర్లలో చుట్టి అంత్యక్రియలు జరిపారు. చివరికి జైనేష్ చితాభస్మాన్ని కూడా వారి కుటుంబ సబ్యలకి ఇవ్వలేదు.

దీనిపై కేరళ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ మాట్లాడుతూ ...జైనేష్ కు కరోనా వైరస్ లేదని రక్తపరీక్షల్లో తేలినప్పటికీ , అతనికి కరోనా వ్యాధి లక్షణాలు ఉండటంతో ఎలాంటి అవకాశం తీసుకోకుండా అంత్యక్రియలు జరిపామని, ముందుగా దీనికి మృతుడి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోయినా, ఆ తర్వాత పరిస్థితిని వారికీ క్షుణ్ణంగా వివరించడంతో వారు కూడా ప్రభుత్వ ప్రతిపాదనకు ఒకే చెప్పారని తెలిపారు.


Tags:    

Similar News