నరేంద్రమోడి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయం తలతిక్కగా ఉంది. అంతర్జాతీయం గా వ్యక్తిగత ఇమేజి తెచ్చుకునేందుకు మాత్రమే మోడి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. అయితే ఇది ఒట్టి ప్రచారం మాత్రమే కాదని నిజం గానే నిజమనేందుకు తాజాగా ఓ ఉదాహరణ వెలుగు చూసింది. ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వ్యాక్సిన్ కొనుగోలు కు అంతర్జాతీయ ఆర్ధిక సంస్ధల నుండి భారీ ఎత్తున అప్పులు చేయటానికి కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక వైపు కోట్లాది టీకాలను విదేశాలకు ఉచితం గా పంపిస్తోంది. మన దేశంలో టీకాలు వేయించేందుకు అప్పులు చేస్తోంది. నరేంద్ర మోడి సర్కార్ చేస్తున్నదాంట్లో ఏమన్నా అర్ధముందా ? విదేశాల కు టీకాలను అందిస్తున్నామని గొప్పలు చెప్పుకోవటానికి ఇప్పటికి 10 కోట్ల టీకాల వరకు ఉచితం గా ఎగుమతి చేసింది. కరోనా వైరస్ వ్యాక్సిన్ల ను విదేశాలకు ఉచితం గా ఎగుమతి చేసే స్ధాయి కి దేశం ఎదిగిందంటే అందరము సంతోషించాల్సిందే. కానీ మన కు అంత సీనుందా ? అంటే లేదనే చెప్పుకోవాలి.
మొన్నటి బడ్జెట్లో కోవిడ్ టీకాలకు రు. 35 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చాలా గొప్ప గా ప్రకటించుకున్నారు. కేటాయింపులు సరే తర్వాత ఏమైంది ? అదే దో అడ్వర్టైజ్మెంట్లో చెప్పినట్లు డబ్బులు ఎవరి కీ ఊరికేరావు అన్నట్లు గా బడ్జెట్లో కేటాయించిన రు. 35 వేల కోట్ల ను రాబట్టుకునేందుకు పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరల ను ఇష్టమొచ్చినట్లు పెంచేస్తోంది.
అంటే దేశం లోని జనాలను చింత బరికెతో బాది డబ్బులు వసూలు చేసి విదేశాలకు టీకాలను ఉచితంగా సరఫరా చేస్తోంది. ఇది సరిపోదన్నట్లుగా ఏషియా డెవలప్మెంట్ బ్యాంకులో రు. 11, 250 కోట్లు, ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్షర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు దగ్గర రు. 3752 కోట్ల అప్పు తీసుకునే ప్రయత్నాల్లో ఉందట. ఇక్కడ మూడు పాయింట్లున్నాయి. మొదటి దేమో ఉచితం గా విదేశాలకు టీకాలను సరఫరా చేయటం. రెండో దేమో టీకాలకు బడ్జెట్లో రు. 35 వేల కోట్లు కేటాయించటం. మూడోపాయింట్ టీకా డబ్బుల కోసం పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు పెంచేసి జనాలను చావబాదేయటం.
ఇక్కడే నాలుగో పాయింట్ ఏమిటంటే టీకాల ఉత్పత్తి పేరు తో బ్యాంకుల్లో అప్పులకు ప్రయత్నాలు చేయటం. అంటే మోడి సర్కార్ అనాలో చిత నిర్ణయాల వల్ల చివర కు బ్యాంకుల్లో అప్పులు తీసుకోవాల్సొస్తోంది. మరి అప్పు చేసి పప్పుకూడు ఎందుకు ? అన్నదే అర్ధం కావటంలేదు. జరుగుతున్నది చూస్తుంటే కేవలం తన వ్యక్తి గత ఇమేజి పెంచుకోవటం కోసమే మోడి పాకులాడుతున్నట్లు అర్ధమై పోతోంది.