ఆంధ్రప్రదేశ్ లో నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అమరావతిని ఎన్జీటీ - శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రాజధానిని ప్రకటించినట్లు చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇది వాస్తవం కాదని.. చంద్రబాబు తన వ్యక్తిగత లాభం కోసం.. తన సొంత అజెండా కోసం అమరావతిని నిర్ణయించారని ఓ వ్యక్తి ఆరోపిస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. ఎన్జీటీ - శివరామకృష్ణ కమిటీ నివేదిక అమరావతిని రాజధానిగా ప్రకటించలేదని సంచలన విషయం తెలిపాడు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి విజయవాడ - గుంటూరు మధ్య రాజధానిని తరలించాడని సంచలన ఆరోపణలు చేశారు.
ఇదే విషయమై సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలైంది. అనిల్ కుమార్ బోరుగడ్డ అనే వ్యక్తి ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే ఈ పిటీషన్ ను జస్టిస్ రోహింగ్టన్ నారిమాన్ - జస్టిస్ రవీంద్ర భట్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అయితే ఈ కేసు విషయమై హై కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ కు సూచించారు. ఒక రాజధాని విషయమై ఓ వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్లడం ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశమైంది. అయితే అతడు చేస్తున్న ఆరోపణలు మాత్రం తెలుగుదేశం పార్టీలో కలవరం రేపుతోంది.
అయితే ఎన్జీటీ - శివరామకృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కి తమ రాజకీయ - వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమరావతిని నిర్ణయించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే ఆ విమర్శలకు బలోపేతం చేస్తూ రాజధాని ప్రాంతంలో భారీ కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఇదే విషయమై అనిల్ కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. అయితే అక్కడ న్యాయమూర్తుల ఆదేశం ప్రకారం మళ్లీ హైకోర్టును ఆశ్రయించనున్నాడు. త్వరలోనే ఈ పిటిషన్ విషయమై హైకోర్టులో విచారణ సాగే అవకాశం ఉంది.