రాష్ట్రపతి.. కేసు పెట్టే ఛాన్సే లేదంతే

Update: 2017-01-31 04:28 GMT
కీలక నిర్ణయాన్ని వెల్లడించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. దేశంలో ఎవరి మీదనైనా కేసు పెట్టే అవకాశం ఉందన్న దానికి బ్రేకులు వేసేలా తన నిర్ణయాన్ని తాజాగా వెల్లడించింది. దేశ ప్రథమ పౌరుడు.. దేశ రాజ్యాంగ అధిపతిగా ఉన్న రాష్ట్రపతిని ఒక లిటిగెంట్ గా చేస్తూ కేసు వేయటం ఏ మాత్రం సాధ్యం కాదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఆదేశాల్నిజారీ చేసింది.

దేశ ప్రధమ పౌరుడు లిటిగెంట్ ఎంతమాత్రం కాదని.. ఆయన్ను ఒక పార్టీగా పేర్కొనలేమన్న విషయాన్ని సుప్రీం స్పష్టం చేసింది. ఎవరైనా రాష్ట్రపతిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కేసులు పెట్టే అవకాశం ఉండదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. రాష్ట్రపతిపై కేసు పెట్టకూడదని తేల్చేసింది. తాజాగా కొందరు మహిళలు రాష్ట్రపతిని లిటిగెంట్ ను చేస్తూ.. ఆయనపై కేసు నమోదు చేయాలని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీం కోర్టు.. ఇలాంటివి రాష్ట్రపతిని ఇబ్బంది పెట్టటానికే తప్పించి..మరెలాంటి ఆలోచన లేదన్న విషయాన్ని తేలుస్తూ.. ద్వేషభావంతో రాష్ట్రపతిపై కేసులు పెట్టాలన్న ఆలోచన మంచిదికాదని.. ఇలాంటి వాటి నుంచి రాష్ట్రపతికి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా ఆయనపై కేసులు పెట్టకూడదని తేల్చేసింది. సమర్థనీయం కాని ఈ తీరుపై సుప్రీం స్పందిస్తూ.. రాష్ట్రపతిపై కేసులు పెట్టటానికి ఎవరికీ ఎలాంటి అర్హత లేదని తేల్చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News