ఏపీలో ఎన్నికలు వాయిదా వేయండి..కోర్టులో పిటిషన్!

Update: 2019-03-22 05:56 GMT
మొదటి దశలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న ప్రాంతం అంతా పోలింగ్ ను వాయిదా వేయాలని కోరుతూ ఏపీ హై కోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయ్యింది. వచ్చే నెల పదకొండో తేదీన తొలి విడత ఎన్నికల పోలింగ్ జరబోతున్న సంగతి తెలిసిందే. ఆ తొలి విడతలోనే తొలి రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. పదకొండో  తేదీన.. ఏపీ - తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఈ నేపథ్యంలో.. ఆ రోజున పోలింగ్ జరగడానికి వీల్లేదన ఒక పిటిషనర్ కోర్టును కోరారు. ఇంతకీ ఎందుకు అంటే.. ఆ రోజున మహాత్మ జ్యోతి బాపూలే జయంతి అని - ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తాయి కాబట్టి.. ఆ రోజున పోలింగ్ జరగడానికి వీల్లేదనేది లాజిక్.

తెలానికి చెందిన సామాజిక కార్యకర్త ఒకరు ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఏపీ హై కోర్టులో ప్రజా ప్రయోజనా వ్యాజ్యంగా దీన్ని దాఖలు చేశారు. దీన్ని విచారణ జరగాల్సి ఉంది.

పూలే జయంతి అధికారికంగా నిర్వహించే కార్యక్రమమే కానీ.. ఆ కార్యక్రమం నిర్వహించడం కోసమని ఇంత వరకూ వచ్చాకా పోలింగ్ ను వాయిదా వేయాలని అనడం సమంజసమేనా.. అనే అంశంపై కోర్టు తేల్చాలి. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచార హోరుతో ముందుకు వెళ్లాయి.

 ఇలాంటి నేపథ్యంలో ఈ పిటిషన్ ను విచారించి - పోలింగ్ విషయంలో కోర్టు ఏం చెబుతుందనేది అత్యంత ఆసక్తిదాయకమైన అంశం. ఇందులో కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
Tags:    

Similar News