దినకరన్ కారుపై బాంబు దాడి

Update: 2018-07-29 11:28 GMT
తమిళనాడు రాజకీయాలను గుప్పిట పట్టాలని చూసిన శశికళ జైలు పాలు కాగా.. ఆమె మేనల్లుడు  దినకరన్ ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నుంచి దినకరన్ ను తీసేశాక ఆయన సొంతంగా పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై దాడి జరగడం తమిళనాట సంచలనం రేపింది.

తమిళనాడులో కారుపై బాంబు  కలకలం రేపింది. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ కారుపై  ఈ దాడి జరిగింది. ఆదివారం ఉదయం ఆయన ఇంటి ముందు నిలిపి ఉన్న వాహనంపై పెట్రోల్ బాంబుతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.  ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మరో నలుగురు గాయపడ్డారు.

కాగా ఈ దాడి సమయంలో దినకరన్ ఇంట్లోనే ఉన్నట్టు సమాచారం. ఆర్కే నగర్ ఎమ్మెల్యేగా గెలుపుపొందిన తర్వాత అమ్మమక్కల్ మున్నేట్ర కగజమ్ పార్టీని స్థాపించిన దినకరన్ పై కక్ష గట్టిన ఆయన వ్యతిరేకులే ఈ దాడి చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News