ఈ మధ్య కాలంలో పనుల మీద ఎమ్మార్వో ఆఫీసులకి వెళ్లేవారి కంటే ..పెట్రోల్ బాటిల్ తో వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. ఏ సమయాన తెలంగాణ అబ్దుల్లాపూర్ మెట్ లో భూమికి సంబంధించిన విషయంలో పట్టపగలే పెట్రోల్ పోసి ఎమ్మార్వో రూమ్ లోనే సజీవ దహనం చేసారో ..అప్పటినుండి ప్రతి రైతు కూడా తమ పనులను త్వరగా చేపించుకోవడానికి పెట్రోల్ బాటిల్ తో ఎమ్మార్వో కార్యాలయాలకి వెళ్తున్నారు.
ఒకటి అధికారుల పై పెట్రోల్ పోస్తానని బెదిరించడమో ..లేకపోతే నా సమస్యకి పరిష్కారం చూపకపోతే ఇక్కడే పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకుంటా అని చెప్తున్నారు. దీనితో ప్రస్తుతం రెవెన్యూ అధికారులందరూ కూడా ఏ క్షణం లో ఏంజరుగుతుందో అని భయపడుతూనే విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే మంగళగిరి లో జరిగింది. మంగళగిరి కి చెందిన శివ కోటేశ్వరరావు అనే రైతు పట్టాదారు పాసుపుస్తకం కోసం సోమవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. ఇప్పటికే ఆ రైతు చాలాసార్లు పాసుపుస్తకం కోసం అధికారుల చుట్టూ తిరిగాడు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో విసుగు చెందిన శివ కోటేశ్వరరావు సోమవారం ఎమ్మార్వో ఆఫీసుకు వస్తూ తన వెంట పెట్రోల్ బాటిల్ తెచ్చుకున్నాడు.
అయితే దీనిని గమనించిన కార్యాలయ సిబ్బంది వెంటనే ఆ రైతుని అడ్డుకున్నారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి శివను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనతో ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు. అతని వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్‌ను గుర్తించకపోతే ఎంత ప్రమాదం జరిగిఉండేదో అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు రోజురోజుకి ఎక్కువై పోతుండటంతో .. రాష్ట్రంలోని చాలామంది ఎమ్మెల్యే లు ఎమ్మార్వోలు పోలీసుల రక్షణ కోరుతున్నారు.