సూపర్ మార్కెట్లలో పెట్రోల్..బంకుల పరిస్థితి ఏమిటి?

Update: 2019-06-19 01:30 GMT
ఇప్పటికే సూపర్ మార్కెట్లలో దొరకని వస్తువంటూ లేకుండా పోయింది. చిన్న సైజు పట్టణాల్లో బ్రాండెండ్ మాల్స్ లో వైన్ - విస్కీలు కూడా అమ్ముతూ ఉన్నారు. నగరాల్లోని  మాల్స్ లో మాత్రమే కాకుండా ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్న మాల్స్ లో కూడా మద్యం అమ్మకాలు సాగుతూ ఉన్నాయి. షాపింగ్ కు అని వెళ్లి మద్యం కొనుక్కొని రావొచ్చు ఇప్పుడు!

ఇక ఇప్పుడు  కేంద్రం కొత్త ఆలోచన చేస్తోంది. సూపర్ మార్కెట్లలో పెట్రోల్ - డీజిల్ లను అందుబాటులో ఉంచాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఈ విషయం గురించి కేబినెట్లో చర్చించనున్నారట. సూపర్ మార్కెట్లలో ప్యాకెట్ల రూపంలో పెట్రో ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతిపాదనను అమలు పెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తూ ఉంది.

అదే జరిగితే పెట్రో బంకులకు గట్టి దెబ్బ తప్పదని చెప్పవచ్చు. మరెక్కడా దొరికే అవకాశాలు తక్కువ కాబట్టి తప్పనిసరిగా వాహనాలు పెట్రోల్ బంకుల బాట పడుతూ ఉంటాయి. ఆ బంకుల్లో జరిగే మోసాలకూ కొదవలేదు.

రకరకాలుగా వినియోగదారులను బంకుల వాళ్లు మోసం చేస్తూనే ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో సూపర్ మార్కెట్లలో లీటర్ల కొద్దీ పెట్రోల్  బాటిల్స్ లోనూ - క్యాన్లలోనూ లభిస్తే.. వినియోగదారులు అటు వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. దీంతో భారీ పెట్టుబడులు పెట్టి బంకులు పెట్టే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేరెవరూ. కేంద్రం అయితే ఈ విషయంలో సానుకూలంగానే ఉందని వార్తలు వస్తుండటం గమనార్హం!
Tags:    

Similar News