జనాల మీద పన్ను మోత మోగించే విషయంలో ఏమాత్రం కనికరం చూపించని మోడీ సర్కారు.. తాను ఇవ్వాల్సిన వస్తే మాత్రం గీసి.. గీసి పైసా.. పైసా ఇవ్వటం కనిపిస్తోంది. ఎన్నికల ముందు విదేశాలకు తరలివెళ్లిన నల్లధనాన్ని భారత్ కు తీసుకొచ్చేసి..ఆ మొత్తాన్ని జనాలకు పంచేస్తానంటూ కమలనాథులు భారీగా హామీలు ఇచ్చేశారు. నల్లధనాన్ని దేశానికి తెచ్చేసి.. దేశ జనాభాకు పంచేయటం లాంటి పనులు చేయకున్నా.. ధర్మంగా.. ప్రజలకు అందాల్సిన ఫలాలు అందిస్తే చాలు మహాప్రభూ అన్న మాట ఇప్పుడు అందరినోటా వినిపిస్తోంది.
అంతర్జాతీయంగా ఉండే ధరలకు తగ్గట్లుగా.. దేశీయంగా పెట్రోల్.. డీజిల్ ధరలు నిర్ణయించటం గత కొన్నేళ్లుగా ఉన్నదే. అంతర్జాతీయంగా ధర విషయంలోకాస్త మార్పులు వచ్చినా.. ఎలాంటి మొహమాటం లేకుండా.. ధరలు భారీగా పెంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకునేది. చమురు కంపెనీలకున్న నష్టాల్ని తగ్గించే పేరుతో.. ప్రజల మీద భారీగానే భారం మోపారు. ఇప్పుడు అంతర్జాతీయంగా ముడిచమురు ధర భారీగా పడిపోయింది. అప్పట్లో బ్యారెల్ ధర 110 డాలర్ల నుంచి 115 డాలర్ల వరకు పలికిన ముడిచమురు ధర ఇప్పుడు ఎంతో తెలుసా..?
మంగళవారం క్లోజింగ్ సమాయానికి బ్యారెల్ ముడిచమురు ధర అక్షరాల 39 అమెరికా డాలర్లు. ఇంత భారీగా ముడిచమురు ధర తగ్గితే.. లెక్క ప్రకారం..దేశంలో పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా తగ్గించాల్సి ఉంటుంది. కానీ.. పెంచే విషయంలో కర్ర కాల్చి వాత పెట్టే సర్కారు.. ధరలు తగ్గినప్పుడు అదే రీతిలో తగ్గించాల్సింది పోయి.. ఎక్కడ లేని పీనాసితనాన్ని ప్రదర్శిస్తోంది. బ్యారెల్ ముడిచమురు ధర 40 డాలర్ల దిగువకు పడిపోయిన నేపథ్యంలో.. పెట్రోల్.. డీజిల్ ధరలు ఈసారి భారీగా తగ్గిస్తారన్న ప్రచారం జరిగింది. గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్నట్లుగా ప్రతి పదిహేను రోజులకు అంతర్జాతీయ ధరలకు తగ్గట్లుగా ధరల్ని మార్చటం తెలిసిందే.
ఇందులోభాగంగా మంగళవారం (డిసెంబరు 15) అంతర్జాతీయ ధరల్ని సమీక్షించి.. మోడీ సర్కారు తగ్గించిన పెట్రోల్ ధర లీటరకు ఎంతో తెలుసా..?అక్షరాల 50పైసలు మాత్రమే. ఇక.. డీజిల్ మీద అయితే 46 పైసలు మాత్రమే. ఓపక్క బ్యారెల్ ధర భారీగా తగ్గుతుంటే.. లీటర్ పెట్రోల?.. డీజిల్ ధరల తగ్గింపు విషయానికి వస్తే.. ఎక్కడలేని పీనాసితనాన్ని ప్రదర్శిస్తూ.. పైసల్లో ధరల తగ్గించటం చూసినప్పుడు.. సామాన్యుడి విషయంలో మోడీ సర్కారు కరుకుగా వ్యవహరిస్తుందనటంతో సందేహమే లేదు. తాజాగా తగ్గించిన చిల్లరతో పెట్రోల్ ధర లీటరు రూ.59.98 కాగా.. డీజిల్ ధర లీటరుకురూ.46.09గా ఉండనుంది. ఈ ధరలు హైదరాబాద్ కు సంబంధించినవి సుమా.