ఈసారికి పెట్రోల్.. డీజిల్ మీద బాదేశారు

Update: 2016-03-16 14:31 GMT
గత కొద్ది నెలలుగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్.. డీజిల్ ధరల విషయంలో ఈసారి కేంద్రం కఠినంగా వ్యవహరించింది. అంతర్జాతీయంగా ముడిచమురు క్షీణత నమోదు అవుతున్నా.. పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచుతూ నిర్ణయాన్ని తీసుకున్నారు. ధరలు తగ్గించే సమయంలో పావలా.. అర్థరూపాయి.. రూపాయి చొప్పున ఆచితూచి వ్యవహరించే కేంద్రం.. వడ్డించే విషయంలో ఎలాంటి మొహమాటాలకు గురి కాకుండా బాదేయటం గమనార్హం.

ప్రతి నెల 15.. 30 తేదీల్లో పెట్రోల్.. డీజిల్ ధరల్ని సమీక్షించి నిర్ణయం తీసుకునే క్రమంలో భాగంగా పెట్రోల్ లీటరుకు రూ.3.07 చొప్పున.. డీజిల్ లీటరుకు రూ.2.90 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా.. పెట్రోల్.. డీజిల్ మీద తాజా బాదుడు దేశ ప్రజలకు చేదువార్తగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News