పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని జేబులో నోట్ల కంటే కార్డులతో బతికేస్తున్న జనాల మీద పిడుగులాంటి వార్తను వేసిన పెట్రోల్ బంకులు వెనక్కి తగ్గాయి. ఆదివారం అర్థరాత్రి నుంచి కార్డులపై పెట్రోల్.. డీజిల్ కొట్టేది లేదని తేల్చి చెప్పిన అంశంలో వెనక్కి తగ్గాయి. దేశ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో పెట్రోల్.. డీజిల్ కొనుగోలుకు కేవలం నగదు మాత్రమే తీసుకుంటామని ఆల్ ఇండియా పెట్రోల్ బంకుల యజమానుల సంఘం స్పష్టం చేయటంతో దేశ ప్రజల గుండెల్లో పెద్దఎత్తున గుబులు మొదలైంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాష్ తో పెట్రోల్.. డీజిల్ కొనుగోళ్లు అంత సులువు కాని నేపథ్యంలో.. ఇలాంటి పరిస్థితిని ఎలా అధిగమించాలా? అన్నది ప్రశ్నగా మారింది. అసలెందుకుకిలాంటి నిర్ణయాన్ని పెట్రోల్ బంకుల యజమానుల సంఘం తీసుకుందన్న విషయంలోకి వెళితే.. పెట్రోల్ బంకుల్లో కార్డుల ద్వారా జరిపే అమ్మకాలపై ఒక శాతాన్ని లావాదేవీల సేవా రుసుము వసూలు చేయాలని బ్యాంకులు కొన్ని ఆకస్మికంగా నిర్ణయాన్ని తీసుకున్నాయి.
వాస్తవానికి పెట్రోల్ బంకుల్లో మార్జిన్ (లాభం) చాలా తక్కువగా ఉంటుంది. వారి లాభం 1.5 నుంచి 2.5 శాతం లోపే ఉంటుందని చెబుతుంటారు. ఇంత తక్కువ లాభానికి అంత భారీగా బిజినెస్ ఎలా చేస్తారన్న సందేహానికి చెప్పే సమాధానం ఏమిటంటే.. భారీగా సాగే లావాదేవీలతోతక్కువ మార్జిన్ అయినా వర్క్ వుట్ అవుతుందని చెబుతారు. అయితే.. బ్యాంకులు తీసుకున్న లావాదేవీలపై ఒక శాతం రుసుము వసూలు పెట్రోల్ బంకులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపటం ఖాయం.
దీంతో.. బ్యాంకుల నిర్ణయానికి నిరసనగా.. ఆదివారం అర్థరాత్రి నుంచి కార్డుల మీద పెట్రోల్.. డీజిల్ అమ్మకాలు జరపకూడదని నిర్ణయించారు. అదేజరిగితే నగదు రహిత లావాదేవీలు జరపాలన్న కేంద్ర.. రాష్ట్రాల ప్రయత్నాలకు భారీగా ఆటంకం కలిగే ప్రమాదం ఉంది. అందుకే.. పెట్రోల్ బంకుల యజమానుల సంఘం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంపై కేంద్రం అత్యవసరంగా స్పందించింది. బ్యాంకులతో మాట్లాడి.. సేవా రుసుము వసూలు చేయటాన్ని తాత్కాలికంగా ఆపేలా నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో.. బ్యాంకులు ఇప్పటికిప్పుడు సేవా రుసుము వసూలు చేయని నేపథ్యంలో.. కార్డులతో అమ్మకాలు జరపమన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న ఒత్తిడిని తీసుకొచ్చింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో కార్డులపై అమ్మకాలు జరపటానికి వీలుగా పెట్రోల్ బంకుల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. సో.. పెట్రోల్ బంకులకు దర్జాగా కార్డులు తీసుకెళ్లి కొనుగోలు జరపొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/