డెల్టా వేరియంట్ పై ఫైజర్, కోవిషీల్డ్ పనిచేస్తాయి: లాన్సెట్

Update: 2021-06-15 15:30 GMT
భారత్ లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వేరియంట్ 'డెల్టా'పై అమెరికా తయారు చేసిన 'ఫైజర్' వ్యాక్సిన్ తోపాటు భారత్ లో సీరం సంస్థ తయారు చేసిన 'కోవీషీల్డ్' సమర్థంగా పనిచేస్తాయని తేలింది.  పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పిహెచ్‌ఇ) నుంచి వచ్చిన కొత్త విశ్లేషణ ప్రకారం డెల్టా (బి 16172) వేరియంట్ సోకినా ఏం కాకుండా రెండు మోతాదుల ఫైజర్ మరియు ఆస్ట్రాజెనెకా  కోవిడ్ -19 టీకాలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని పరిశోధనలో తేలింది.

ఫైజర్-బయోఎంటెక్ టీకా రెండు డోసుల తర్వాత ఆసుపత్రిలో చేరడానికి 96 శాతం మంది దూరం అవుతున్నారని.. అది ప్రభావవంతంగా పనిచేస్తోందని విశ్లేషణలు సూచిస్తున్నాయి, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుంటే ఆసుపత్రిలో చేరకుండా 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని తేలింది.

ఇక కరోనా ఆల్ఫా (బి 117) వేరియంట్ నుండి ఈ రెండు టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయని తేలింది.  ఫైజర్ వ్యాక్సిన్‌ రెండు డోసులు వేసుకుంటే 96 శాతం అల్ఫా వేరియంట్ ను నియంత్రిస్తోందని.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల  రెండు డోసులు వేసుకున్న వారికి 92 శాతం ఫలితమిస్తుందని తేలింది..

కొత్త విశ్లేషణలో డెల్టా వేరియంట్ 14,019 కేసులు పరిశీలించారు. వీరిలో 166 మంది ఏప్రిల్ 12 -జూన్ 4 మధ్య ఆసుపత్రిలో చేరారు. ఇంగ్లాండ్‌లోని అత్యవసర ఆసుపత్రులలో చికిత్స పొందారు. వారిపై పరిశోధన చేయగా ఈ విషయాలు బయటపడ్డాయి.  "వేరియంట్‌లకు వ్యతిరేకంగా రెండు డోసుల వ్యాక్సిన్లు వేసుకున్నవారికి ఎలాంటి ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం రాలేదు.  మీరు మీ మొదటి మోతాదును వేసుకున్నప్పటికీ మీ రెండవదాన్ని ఇంకా బుక్ చేసుకోకపోతే - దయచేసి వెంటనే వేసుకోండి. ఇది ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది.  రికవరీని తొందరగా చేస్తుంది "అని ఆరోగ్య, సామాజిక సంరక్షణ కార్యదర్శి మాట్ హాన్కాక్ ఒక ప్రకటనలో తెలిపారు.

"డెల్టా వేరియంట్ బారినపడకుండా ఆసుపత్రిలో చేరకుండా ఈ వ్యాక్సిన్లు గణనీయమైన రక్షణను అందిస్తాయని ఈ పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. కోవిడ్ -19కి వ్యతిరేకంగా టీకాలు మన వద్ద ఉన్న అతి ముఖ్యమైన సాధనం. వాటి కారణంగా వేలాది మంది ప్రాణాలు ఇప్పటికే రక్షించబడ్డాయి. ఇది పొందడం చాలా అవసరం. ఇప్పటికే ఉన్న మరియు అభివృద్ధి చెందుతున్న అన్ని వేరియంట్ల నుండి గరిష్ట రక్షణ పొందడానికి రెండు డోసుల టీకాలు వెంటనే వేసుకోండి "అని ఇంగ్లండ్ పరిశోధకులు తేల్చారు.

మేలో పిహెచ్‌ఇ చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. ఫైజర్ , ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ రెండింటి  మొదటి డోసు డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా కేవలం 33 శాతం రక్షణను మాత్రమే అందించింది. అయితే ఇది ఆల్ఫా వేరియంట్‌కు వ్యతిరేకంగా 50 శాతం ప్రభావాన్ని అందించింది.

డెల్టా వేరియంట్ మొట్టమొదట భారతదేశంలో కనుగొనబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గత నెలలో దీనిని ప్రపంచంలోనే ప్రమాదకర వైరస్ లలో ఒకటిగా ప్రకటించింది.  ఇది యూకేలో గుర్తించిన ఆల్ఫా జాతి కంటే 60 శాతం ఎక్కువ వ్యాపిస్తోందని తేల్చింది.
Tags:    

Similar News