కరోనా వ్యాక్సిన్‌తో కాసులవర్షం.. అడ్రస్‌లేని కంపెనీల షేర్లు అమాంతం పైకి!
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా వ్యాక్సిన్‌పైనే చర్చ జరుగుతోంది. ఈ వ్యాక్సిన్లు ఎంతమేర ప్రభావంతంగా పనిచేస్తాయి. కరోనాను సమూలంగా తరిమేస్తాయా? లేదా? అన్న విషయం మరికొద్ది రోజల్లో తేలిపోనుంది. అయితే కరోనా వ్యాక్సిన్లు మాత్రం కొన్ని కంపెనీలకు భారీ లాభాలు తెచ్చిపెట్టనున్నాయట. ఇప్పటివరకు ఉనికిలో కూడా లేని పలు కంపెనీలు వ్యాక్సిన్ దెబ్బకు ఎక్కడికో వెళ్లిపోయాయి. వాటి షేర్లు అమాంతం పెరిగాయి. భారీ లాభాలు వచ్చిపడుతున్నాయి.
వ్యాక్సిన్ తయారీలో ప్రస్తుతం టాప్‌లో దూసుకుపోతున్న కంపెనీలు ఫైజర్, మోడెర్నా. ఈ రెండు కంపెనీలు కేవలం కరోనా వ్యాక్సిన్‌తోనే ఈ ఏడాది 32 బిలియన్ డాలర్ల సంపాదిస్తాయని టాక్. ఈమేరకు అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. ఫైజర్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా కొంత పేరు ఉంది. కానీ మోడెర్నా మాత్రం కరోనా వ్యాక్సిన్‌కు ముందు ఎవరికీ తెలియదు.
ఈ ఏడాది (2020) లో మోడెర్నా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఫైజర్ కంపెనీ కరోనా వ్యాక్సిన్ కోసం జర్మన్‌కు చెందిన బయోఎన్‌టెక్‌తో చేతులు కలిపింది. వ్యాక్సిన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ రెండు కంపెనీలు షేర్ చేసుకోనున్నాయి. ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత సక్సెస్ అయిన వ్యాక్సిన్ ఫైజర్ మాత్రమే. ఈ వ్యాక్సిన్‌కు ఇప్పటకే బ్రిటన్‌లో అనుమతులు వచ్చాయి. అమెరికాలో త్వరలోనే రానున్నాయి.
2022, 2023లలో మొత్తం కొవిడ్ వ్యాక్సిన్ ఆదాయంలో ఫైజర్ వాటా 9.3 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఫైజర్ ఇప్పటికే పెద్ద కంపెనీ కాబట్టి దాని షేర్లు ఎక్కువగా ఏమి పెరగలేదు. కానీ ఎవరికీ తెలియని మోడెర్నా కంపెనీ మాత్రం దాదాపు 700 శాతం షేర్లు పెంచుకున్నది.