ఫిలిప్సిన్ పై ఉగ్ర పంజా

Update: 2019-01-27 09:21 GMT
ఫిలిప్సిన్లో  ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జోలో ఐలాండ్ ప్రాంతంలోని చర్చి వద్ద ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డాడు. ఈ  సంఘటనలో 21మంది మృతిచెందగా 50మందికిపైగా గాయపడ్డారు.

జోలో ఐలాండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు కిడ్నాప్ లు, బాంబు పేలుళ్లు హత్యలతో ఉగ్రవాదులు చేయడం సాధారణంగా మారింది.  కాగా రెండు వరుస పేలుళ్లతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. అక్కడి స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు.

ఉగ్రవాదులు మొదటి పేలుడును కాథెడ్రల్ చర్చి ప్రాంగణంలో చేసినట్లు సమాచారం. ఆ పేలుడు జరిగిన వెంటనే సైనికులు క్షతగాత్రులను కాపాడేందుకు రాగా మరో సారి బాంబు పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో 17మంది అక్కడిక్కడే మృతిచెందగా కొందరు ఆసుప్రతిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇప్పటివరకు అందిన సమాచారం వరకు 21మంది మృతిచెందగా ఈసంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉగ్రదాడిలో 50మందికిపైగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఆర్మ్ డ్ ఫోర్సెస్ ఆఫ్ ఫిలిప్సిన్ - ఫిలిప్సీన్ నేషనల్ పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపడుతున్నారు. ఇద్దరు అనుమానితులను స్థానిక పోలీసులు గుర్తించి విచారిస్తున్నారు.

Tags:    

Similar News