అమ్మాయిల టాయిలెట్ లో మొబైల్‌ తో రికార్డ్:.చెన్నై ఐఐటీలో కలకలం!

Update: 2020-02-22 02:30 GMT
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు మహిళలకు రక్షణ ఉందా ? అనే అనుమానం రాకమానదు. గుడి , బడి .. ఇలా చోటేదైనా కూడా అమ్మాయిల రహస్య వీడియోలని చిత్రీకరించి , వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి తాజాగా చెన్నై ఐఐటీలో బయటపడింది. ఐఐటి మద్రాస్ క్యాంపస్‌ లోని మహిళల బాత్రూం లో అక్కడి అసిస్టెంట్ ప్రొఫెసర్ రహస్యంగా సెల్‌ఫోన్ దాచి , అమ్మాయిల అశ్లీల చిత్రాలు రికార్డు చేస్తున్న విషయం తెలిసి అందరూ షాకయ్యారు.

ఐ ఐ టి అంటే దేశంలోని పలు రాష్ట్రాల స్టూడెంట్స్ చదువుకుంటుంటారు. అలాగే ఇదే క్యాంపస్ లో అమ్మిలకి , అబ్బాయిలకి హాస్టల్ వసతి కూడా ఉంది. అలాగే ఈ క్యాంపస్‌లో మహిళల,పురుషుల వాష్‌ రూంలు పక్క పక్కనే ఉన్నాయి. దీన్నే ఆయుధంగా మలచుకున్న ఆ కామాంధుడు ..అమ్మాయిలు ఉపయోగించే టాయిలెట్ లో రహస్యం  గా మొబైల్ పెట్టి వీడియోలు చిత్రీకరించి వాటిని చేస్తుండేవాడు. అసలు ఈ విషయం ఎలా బయట పడింది అంటే ..?

రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో ఓ 30 ఏళ్ల పిహెచ్‌డీ విద్యార్థిని అక్కడున్న టాయ్‌లెట్‌ కు వెళ్లింది. ఆ సమయంలో అక్కడ చిన్న సైజులో వెళుతురు కనబడుతుండడం చూసి దగ్గరికి వెళ్లి చూడగా దిగ్భ్రాంతి చెందింది. ఆ సమయంలో టాయ్‌లెట్‌ బయట ఉన్న నీటి కొళాయి లో సన్నటి మార్గం గుండా ఒకరు సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తున్నాడు అని గమనించింది. దీనితో వెంటనే అమ్మాయిల టాయిలెట్ నుండి బయటకి వచ్చి, అబ్బాయిల టాయిలెట్ రూమ్ కి గడియ పెట్టి ..గట్టిగ అరిచి అందరిని పిలిచింది. దీనితో అందరూ అక్కడికి చేరుకున్నారు . అందరూ కలిసి అబ్బాయిల టాయిలెట్ ఓపెన్ చేయగా ..అందులో నుండి ఐఐటీ లో పని చేస్తున్న ప్రొఫసర్‌ శుభం బేనర్జీ బయటకి వచ్చాడు. అతని వద్ద సెల్‌ఫోన్‌ తీసుకుని తనిఖీ చేయగా అందులో విద్యార్థినుల అసభ్య చిత్రాలు నమోదై ఉన్నాయి. దీనితో విద్యార్థినిలు పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీనితో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రొఫసర్‌ సుభం బెనర్జిని అదుపులోకి తీసుకొని , విచారణ చేస్తున్నారు.
Tags:    

Similar News