ఫోన్ పే పై పడిన ఎస్ బ్యాంకు ప్రభావం ...ఏమైందంటే ?

Update: 2020-03-07 06:53 GMT
ప్రస్తుత రోజుల్లో బ్యాంక్‌ లావాదేవీలను ప్రతి ఒక్కరూ కూడా ఇంటి నుంచే వారి మొబైల్‌ ఫోన్ల ద్వారా జరిపిస్తున్నారు. క్షణాల్లో, ఇంకోకరికి డబ్బులను ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారు. మొబైల్‌ ఫోన్ల ద్వారా డబ్బులను ట్రాన్స్‌ఫర్‌ గానీ, రిసీవ్‌ చేసుకోవడం చాలా సులభం కావడంతో ప్రతి ఒక్కరూ దీనికి బాగా అడిక్ట్ అయి పోయారు. ఈ సమయంలో ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ యాప్ ‘ఫోన్ పే’ తన యూజర్లకి బిగ్ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఫోన్ పే వర్క్ అవ్వడం లేదు.

దీనికి కారణం ఎస్ బ్యాంక్ సంక్షోభం. గత కొన్ని రోజులు ఎస్ బ్యాంక్ సంక్షోభంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఎస్ బ్యాంక్‌‌తో ఫోన్ పే ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ యాప్‌ లో డబ్బు చెల్లింపులు అన్నీ కూడా ఆ బ్యాంక్ ద్వారానే జరుగుతాయి. అయితే ,ప్రస్తుతం ఎస్ బ్యాంకు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కుంటుండటంతో గురువారం రాత్రి నుంచి ఫోన్ పే సర్వీసులన్నీ నిలిచిపోయాయి. అంతేకాకుండా సర్వీసులను తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు ఫోన్ పే చీఫ్ ఎగ్జి‌క్యూటివ్ సమీర్ నిగమ్ కూడా ట్వీట్ చేశారు. ఫోన్‌ పే యూజర్లకు క్షమాపణలను చెప్పి, తమ సేవలను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఈ రోజు ఉదయం మళ్లీ ఫోన్ పే సేవలు ప్రారంభమయ్యాయని తెలుస్తున్నా.. ఇంకా కొందరు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

ఇకపోతే, ఎస్ బ్యాంకు సంక్షోభంలో పడి పోవడంతో డిపాజిటర్లు, ఇన్వెస్టర్ల లో భయం నెలకొంది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే.. వారంతా బ్యాంకులు, ఏటీఎంల వద్ద తమ డబ్బులను విత్‌డ్రా చేసుకునేందుకు క్యూ కట్టారు. అయితే ఆ విత్ డ్రా లిమిట్‌‌పై ఆర్బీఐ పలు షరతులను విధించింది. అకౌంట్ హోల్డర్లు అంతా ఒకేసారి డబ్బులు విత్ డ్రా చేస్తే.. మరింత సంక్షోభంలోకి బ్యాంకు వెళ్లాల్సి వస్తుందన్న ఉద్దేశంతో.. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఒక్కో అకౌంట్ హోల్డర్.. కేవలం రూ. 50 వేలు వరకు మాత్రమే డబ్బులు తీసుకునేలా ఆంక్షలు పెట్టింది. అయితే కేంద్రం మాత్రం ఎస్ బ్యాంకు అకౌంట్ హోల్డర్స్ కి దైర్యం చెప్తుంది. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది రాదు అని చెప్తుంది.


Tags:    

Similar News