మనిషి శ్వాసని బట్టి కరోనాను నిర్దారించవచ్చా ? ఎవరు చెప్పారంటే !

Update: 2020-04-10 01:30 GMT

కరోనావైరస్ రోజురోజుకి ప్రపంచ వ్యాప్తంగా మరింతగా విజృంభిస్తుంది. వెలుగులోకి వచ్చిన చైనాలో ఈ కరోనా కంట్రోల్ లోకి వచ్చినా కూడా, ఇతర దేశాలలో మాత్రం దాని ప్రభావం భారీగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ బాధితుల సంఖ్య 15 లక్షలు దాటింది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల 88వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వీటిలో అధిక భాగం ఐరోపాలోని ఇటలీ - స్పెయిన్ - ఫ్రాన్స్ - అమెరికాల్లోనే ఉన్నాయి. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 5వేల మంది మృతిచెందారంటే పరిస్థితి భయానకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇకపోతే , ఈ కరోనా నియంత్రణలో చర్యల్లో వైద్య పరీక్షలు కీలకంగా మారాయి. వైరస్ సోకిన పేషెంట్లను త్వరగా గుర్తించగలిగితే.. వైరస్‌ వ్యాప్తిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కానీ , మన దేశంలో 130 కోట్లకి పైగా జనాభా ఉండటంతో వైద్య పరీక్షలు ప్రభుత్వానికి సవాల్‌ గా మారాయి. సగటున ఒక మిలియన్ జనాభాకు ఇప్పటివరకు కేవలం 100 వైద్య పరీక్షలు మాత్రమే నిర్వహించారు. అమెరికా - ఇటలీ లాంటి దేశాలలో ఒక మిలియన్ జనాభాకు 6వేల నుంచి 10వేల పైచిలుకు టెస్టులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కేసులను త్వరగా గుర్తించడంలో.. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ఆ దేశాలు విఫలమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో వైరస్ లక్షణాలను గుర్తించడం కోసం కొత్త రకం టెక్నాలజీ తెర పైకి వస్తోంది. కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు కరోనా నిర్దారణ పరీక్షల కోసమా  ఓ కొత్త రకం  మొబైల్ యాప్‌ ను రూపొందించారు. ఈ యాప్ ప్రత్యేకత ఏంటి అంటే .. మనిషి మాట్లాడేటప్పుడు,శ్వాస తీసుకునేటప్పుడు - దగ్గేటప్పుడు వచ్చే సౌండ్ ద్వారా అతనికి కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో  తెలియజేస్తుంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే  కరోనా వైద్య పరీక్షలకు సంబంధించిన సవాల్‌ ను అధిగమించినట్టే అని చెప్పవచ్చు .

ఈ మొబైల్ యాప్‌ కి సంబంధించి యూరోపియన్ రీసెర్చ్ కౌన్సిల్ ఒక ప్రెస్ స్టేట్‌ మెంట్ విడుదల చేసింది. కరోనా శ్వాసకోశ సమస్యకు సంబంధించినది కావడంతో.. వైరస్ సోకినవారిలో శ్వాస తీసుకునేటప్పుడు, దగ్గేటప్పుడు వచ్చే సౌండ్ భిన్నంగా ఉంటుందని,  ఈ యాప్ యూజర్స్ హెల్త్ డేటాను,మెడికల్ హిస్టరీని సేకరిస్తుందని తెలిపింది. అలాగే వారి శ్వాస,దగ్గుకు సంబంధించిన సౌండ్స్ సాంపిల్స్‌ ను రికార్డు చేస్తుందని తెలిపింది.  కరోనాపై పోరులో ఓవైపు మానవ ప్రయత్నం జరుగుతూనే... మరోవైపు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా కూడా సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో బాగంగా భారత్‌ లోనూ ప్రభుత్వం ఆరోగ్య సేతు అనే మొబైల్ యాప్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా పాజిటివ్ పేషెంట్లను గుర్తించడంతో పాటు.. పాజిటివ్ పేషెంట్లకు దూరంగా ఉండేలా ప్రజలను అప్రమత్తం చేయడంలో ఈ యాప్ పనిచేస్తుంది.
Tags:    

Similar News