ఇన్ఫోసిస్ నారాయణ సింప్లిసిటీకి అద్ధం పడుతున్న ఫోటో..!

Update: 2022-12-19 11:30 GMT
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తగా.. బిలియనీర్ గా గుర్తింపు తెచ్చుకున్న నారాయణ మూర్తి ఎంత ఎదిగిన తన ఒదిగి ఉండాలనే లక్షణాన్ని అలవర్చుకున్నారు. ఈ లక్షణమే ఆయన్ని అందరి కంటే ఉన్నతంగా నిలబెట్టిందని చెప్పడం అతిశయోక్తి కాదేమో..!

నారాయణ మూర్తి  వినయ.. విధేయతల గురించి తోటి వ్యాపారవేత్తలు ఎప్పుడూ కీర్తిస్తూనే ఉంటారు. ఆయన గురించి ప్రతీఒక్కరూ పాజిటివ్ గానే మాట్లాడుతుండటం తరుచూ కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఆయన సింప్లిసిటీని చూపించే ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ మారింది. దీంతో ఆయనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా రాజాంలోని జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్పోసిస్ నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు సోదరుడు నీలాచలం ఆయనకు ఎదురయ్యారు. ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్ నారాయణ ఆయన పాదాలకు మోకరిల్లి(పాదాభివందనం) చేశారు.

ఈ సంఘటనను చూసిన వేలాది మంది విద్యార్థులు.. సభికులు చప్పట్లతో తమ హర్షం వెలిబుచ్చారు. దీంతో కళాశాల ఆడిటోయం మొత్తం చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సింప్లిసిటీకి ఇదొక మచ్చుతునక అని పలువురు కొనియాడుతున్నారు. ఇప్పటి వరకు ఇన్పోసిన్ నారాయణ చాలా వినయపూర్వకంగా ఉంటారని వినడమే కానీ తాజాగా జరిగిన ఆయన వ్యక్తిత్వాన్ని చాటుతుందని అంటున్నారు.

ఇన్ఫోసిస్ నారాయణ భారత దేశం గర్వించదగిన వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచారు. అంతేకాకుండా సంపాదనలోనూ ఎవరికీ తీసిపోని విధంగా ఆర్జించారు. భారత దేశంలోని బిలియన్ల జాబితాలో నారాయణ పేరు కూడా ఉంది. ఇన్ఫోసిస్ వంటి ఒక దిగ్గజ టెక్ కంపెనీని అభివృద్ధి చేశారు. అయినప్పటికీ ఆయన తన మూలాలను మాత్రం మర్చిపోకుండా ఇప్పటికీ వినయపూర్వకంగా ఉండటం నిజంగా అభినందించాల్సిన విషయమేనని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News