అతడి ఫోన్ లో 50వేల అమ్మాయిల ఫోటోలు.. పోలీసులే అవాక్కు

Update: 2022-12-07 04:26 GMT
వ్యభిచార ముఠాల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవటం రోటీన్ గా జరిగే వ్యవహారం. అయితే.. తాజాగా పట్టుకున్న వ్యభిచార ముఠాకు సంబంధించి వివరాల్ని సేకరిస్తున్న పోలీసులకు దిమ్మ తిరిగిపోతోంది. అంతర్జాతీయ వ్యభిచార ముఠాలో ప్రధాన నిందితుడిగా ఉన్న 31 ఏళ్ల  మహ్మద్ అదీమ్ ఫోన్ చూసిన పోలీసులకు నోట మాట రావటం లేదు. దీనికి కారణం అతడి ఫోన్ లో ఉన్న 50 వేల (సరిగ్గా చెప్పాలంటే 49,900 ఫోటోలు) మంది అమ్మాయిలు.. వారి ప్రొఫైల్స్ ను చూసి పోలీసులు సైతం అవాక్కు అవుతున్నారు. అతగాడి ఫోన్ దెబ్బకు అతడి వ్యాపార స్థాయి ఎంతలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఎప్పటికప్పుడు తన పేర్లను మార్చుకునే అలవాటున్న అదీమ్ ఫోన్ చిన్న సైజు గూగుల్ గా ఉందంటున్నారు. ఇతగాడి కోసం దాదాపు మూడేళ్లకు పైనే సైబరాబాద్ పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పటికే అతడి మీద గచ్చిబౌలి.. మాదాపూర్..

రాయదుర్గంతో పాటు పలు పోలీస్ స్టేషన్ లో పదికి పైగా కేసులు ఉన్నా.. అతడ్నిమాత్రం పట్టుకోలేకపోయారు. దీంతో.. సవాలుగా తీసుకున్న పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఇతడు చేసే వ్యభిచార దందాలో తనకు సహకారాన్ని అందించే ఒక అమ్మాయితో ఇతగాడు లివింగ్ రిలేషన్ లో ఉండటం గమనార్హం.

దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు.. విదేశాల నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చే నెట్ వర్కు ఉన్న ఇతగాడి వెనుక ఉన్నదెవరు. అతడి ఆపరేషన్స్ కు సహకరించేవారెవరు? ఇంతటి భారీ నెట్ వర్కు ఒక వ్యక్తితో సాధ్యమేనా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇతడికి సహకారాన్ని అందిస్తున్న కీలక వ్యక్తులు ఎవరు? అన్న ప్రశ్నతో పాటు.. ఇతడి నుంచి సేవలు అందుకునే ప్రముఖులు.. కీలక స్థానాల్లో ఉన్న వారు ఎవరు? అన్న కోణంలోనూ పోలీసుల విచారణ సాగుతున్నట్లు చెబుతున్నారు.

ఇతగాడితో పాటుమరో ఐదుగురు కీలకమని.. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా అదుపులోకి తీసుకున్న నిందితుడి ఫోన్ .. అందులోని డేటా ఆధారంగా మరిన్ని వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఏమైనా.. ఒక వ్యక్తి ఫోన్లో 50 వేల వరకు వేర్వేరు అమ్మాయిల ఫోటోలు.. వారి వ్యక్తిగత వివరాలకు సంబంధించిన డేటా బేస్ ఉండటం పోలీసుల్ని సైతం నిర్ఘాంతపోయేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News