ముక్కులో పక్కు అన్న మాట విన్న వెంటనే ముఖంలో రంగులు విపరీతంగా మారిపోతాయి. వినకూడనిదేదో విన్నట్లుగా ముఖం పెట్టటమే కాదు.. ఇలాంటి వాటి గురించి ఏం చదువుతామనుకోవచ్చు. కానీ.. చదివిన తర్వాత మాత్రం అరే.. ఇది చదవటం మిస్ అయితే చాలా ముఖ్యమైన విషయం మిస్ అయ్యేదనుకోవటం ఖాయం. ఎందుకంటే.. ముక్కలో పక్కులో ఉన్న విషయం అలాంటిది. ముక్కులో పొక్కుల్ని వేళ్లతో తీయటం చెడు అలవాటుగా చెబుతుంటాం. దీని వల్ల ముక్కులోని సున్నితమైన చర్మానికి నష్టం జరుగుతుందని చెబుతుంటారు.
అయితే.. ఇలాంటి వాదనలో అంత నిజం లేదని చెబుతుంటారు. ముక్కు బ్యాక్టీరియాను వడకట్టే ఫిల్టర్ లా పని చేస్తుందని.. ముక్కులో కొంత బ్యాక్టీరియా కలుస్తుందని.. ఆ మిశ్రమం కడుపులోకి వెళ్లినప్పుడు ఔషధంలా పని చేస్తుందన్న కొత్త విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎండిన పక్కుల్ని విదిల్చి పడేయకుండా.. నోటితో తినే అలవాటున్న వారు.. తమకు తెలీకుండానే చాలామంచి పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ముక్కులో పక్కులు తినటం వల్ల ఆరోగ్యానికి మంచిదని.. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆస్ట్రియాకు చెందిన ఊపిరితిత్తుల నిపుణుడు ప్రొఫెసర్ ప్రెడిరిక్ బిఛింగర్ చెబుతున్నారు. ముక్కులోని చీమిడిలో మంచి బ్యాక్టీరియా ఉంటుందని.. ఇది పళ్ల చిగుళ్లను కాపాడుతుందని హార్వర్డ్ వర్ఇసటీ.. మాసాచూసెట్స్ సైంటిస్టులు కూడా చెప్పటం గమనార్హం. ముక్కులో పక్కుల్ని తినే అలవాటు కొంతమందికి ఉండటంపై స్పందిస్తూ సదరు సైంటిస్టులు.. ప్రకృతి కొన్ని మనల్ని తినమని ప్రేరేపిస్తుందని.. అలాంటి అలవాట్లలో భాగంగానే ముక్కులో పక్కులు తింటుంటారని.. ఇది సహజమైన అలవాటని.. దీన్ని మానుకోవాల్సిన అవసరం లేదని చెబుతారు. చీమిడి కడుపులో అల్సర్లు.. ఇన్ ఫెక్షన్లు రాకుండా చూడటమే కాదు.. ఎయిడ్స్ రాకుండా నిరోధిస్తుందన్న కొత్త విషయాన్ని చెబుతున్నారు. ముక్కులో పక్కు అన్న మాట విన్నంతనే ఛీ కొట్టే వారు.. ఇది చదివాక మరీ.. అంతగా అసహ్యించుకోరనటంలో సందేహం ఉండదనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/