తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగతంగా నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి శుక్రవారం జనం పోటెత్తారు. గత రెండు రోజులుగా వైభవంగా సాగుతున్న చండీయోగంపై విస్తృతంగా ప్రచారం జరగటంతో ప్రజలు భారీగా వస్తున్నారు. ఇక.. ఏర్పాట్లు భారీగా ఉన్నాయన్న విషయం ప్రముఖంగా రావటం.. వీవీఐపీలు తరలి రావటంతో పాటు.. అరుదైన యాగంగా చెబుతున్న నేపథ్యంతో పాటు.. వరుస సెలవులు కావటంతో తెలంగాణలోని పలు జిల్లాల నుంచి ప్రజలు ఎర్రవెల్లి వైపు వెళుతున్నారు. యాగంలో మూడో రోజైన శుక్రవారం ఉదయం 5 గంటల నుంచే భక్తుల రద్దీ మొదలైంది. ఇది అంతకంతకూ పెరిగిపోయిన పరిస్థితి.
మధ్యాహ్నం ఒంటి గంట సమయానికే లక్ష మందికిపైగా భక్తులు వచ్చినట్లుగా చెబుతున్నారు. భారీగా తరలివస్తున్న భక్తులతో పోలీసు అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జనసంద్రంగా మారిన రహదారుల్నిక్లియర్ చేయలేక నానా అవస్థలు పడుతున్నారు. ఒకవైపు సామాన్య జనం పోటెత్తుతుంటే.. మరోవైపు వీవీఐపీలు పలువురు యాగానికి వస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు.. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్.. ఏపీ మండలి ఛైర్మన్ చక్రపాణి.. త్రిదండి చిన జీయర్ స్వామి.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో సహా పలువురు ముఖ్యులు యాగానికి విచ్చేశారు.
భారీగా జనం రాకతో ఎర్రవెల్లి కిక్కిరిసోతోంది. ఎర్రవెల్లి దారులన్నీ వాహనాలతో పోటెత్తుతున్నాయి. రెండు కిలోమీటర్ల మేర భక్తుల క్యూలైన్ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న రద్దీతో చూస్తే.. శుక్రవారం రికార్డు స్థాయిలో రావటం ఖాయమన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.