విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తెదేపా నేత యలమంచిలి రవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది అధికార పార్టీకి ఇబ్బందికరమైన వ్యవహారమే.. అయితే దీనివలన పార్టీ పరువు పోకుండా.. దానికి కౌంటర్ గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఓ ముసలం పుట్టించడానికి ప్రయత్నం జరుగుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రకరకాల సమీకరణాలను ప్రేరేపించి.. ఒక సామాజిక వర్గంలో వైకాపా పట్ల పూర్తిగా ద్వేషం రగులుతున్నట్లుగా చిత్రీకరించి... కీలకమైన కొందరు నాయకులను వైకాపాకు దూరం చేయాలనేది పచ్చవ్యూహంగా పలువురు భావిస్తున్నారు. ఇలాంటి వక్రవ్యూహంలో అనూహ్యంగా.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చిక్కకున్నట్లుగా కనిపిస్తోంది.
ఈ వివాదం ఎందుకు ఎప్పుడు పుట్టిందనడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. హఠాత్తుగా వివాదం తెరమీదకు వచ్చింది. శెట్టి బలిజ సామాజిక వర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి రేగుతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ పార్టీలో తమ సామాజిక వర్గానికి సరైన ప్రాదాన్యం దక్కడం లేదని వారు అలిగినట్లుగా హఠాత్తుగా పుకార్లు వచ్చాయి. ముందస్తు సంకేతాలు లేవు. పార్టీ పిలుపు ఇచ్చిన రిలేనిరాహార దీక్షల్లో ఆ సామాజిక వర్గం వారు కూడా కూర్చుని దీక్షలు చేస్తుండగా.. కులపెద్దలు వచ్చి వారిని దీక్ష నుచి తీసుకెళ్లిపోవడం చూస్తోంటే.. హఠాత్తుగా ఎవరో ప్రేరేపించినట్లుగా ఇది జరిగిందనే వాదన వినిపించింది.
దాని ఫాలోఅప్ గా పార్టీ సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్.. తమ శెట్టి బలిజ కులం వారి నిర్ణయం మేరకు పార్టీ వైఖరి మారే వరకు తాను వైకాపాకు దూరంగా ఉండదలచుకున్నానని.. కులాన్ని మీరి తాను నిర్ణయాలను తీసుకోలేనని ప్రకటించడం చిత్రంగా కనిపిస్తోంది. ఎవరో దురుద్దేశ పూర్వకంగా కులాన్ని ప్రేరేపించి.. ఇలాంటి ముసలం పుట్టించారనే ప్రచారం జరుగుతోంది.