ఒక యుద్ధ విమానం మిస్ అయిన వేళ.. దాని ఆచూకీ కనుగొనేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా దాని ఆచూకీ కనుగొనటంలో ఫెయిల్ అయిన ఉందంతం తెలిసిందే. భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం మిస్ కావటం.. దాని కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఉదంతానికి సంబంధించిన కొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది.
విమానం అసోం నుంచి బయలుదేరినప్పుడు ఐఏఎఫ్ పైలట్ ఆశిష్ తన్వార్ విమానాన్ని నడుపుతుండగా.. ఆయన సతీమణి సంధ్య తన్వారే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డ్యూలో ఉన్నారు. ఆశిష్ తో పాటు మరో 12 మంది ప్రయాణిస్తున్న ఆ విమానం రాడార్ నుంచి అదృశ్యం కావటాన్ని ఆమె కనులారా చూడటమే కాదు.. చెవులారా విన్న కొత్త విషయం బయటకు వచ్చింది.
ఒక ప్రముఖ మీడియా సంస్థ దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక కథనాన్ని పబ్లిష్ చేసింది. ఆ కథనం ప్రకారం అసోంలోని జోహ్రట్ నుంచి సంధ్య భర్త నడుపుతున్న విమానం సోమవారం మధ్యాహ్నం12.25 గంటలకు బయలుదేరింది. అప్పుడు ఐఏఎఫ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూంను ఆమె పర్యవేక్షిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లోని మెంచుక బేస్ వైపు వెళుతున్న వేళలో.. విమానం రాడార్ నుంచి మిస్ అయ్యింది. అప్పడు సమయం దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట వరకూ అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అప్పటి నుంచి దాదాపు గంటల పాటు విమానం ఆచూకీ లేకుండా పోవటంతో ఆమె ఆశిష్ చిన్నాన్న ఉదయ్ వీర్ సింగ్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. విమానం కూలిపోయినట్లు భావిస్తున్నప్పటికి ఇప్పటివరకూ ఎలాంటి ఆచూకీ లభించలేదు. విమానం కూలిందని భావిస్తున్న ప్రాంతంలో ఎలాంటి శకలాలు లభించలేదు.
గత ఏడాది ఫిబ్రవరిలోనే ఆశిష్..సంధ్యల వివాహం జరిగింది. అప్పటి నుంచి వీరిద్దరు అసోంలోనే కలిసి పని చేస్తున్నారు. విమానం మిస్ అయినప్పటి నుంచి ఆశిష్ నివాసంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన తండ్రి అధికారులతో మాట్లాడటానికి అసోం వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆశిష్ కుటుంబంలోని వారంతా సైనికులు.. మాజీ సైనికులే కావటం గమనార్హం.