మహిళలకు గర్భనిరోధక మాత్రలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.. పురుషులకు ఉన్నాయన్న సంగతి తెలుసా? మీకు తెలియదు కదా.. ఎందుకంటే ఇప్పటి వరకూ అవి లేనేలేవు. కానీ.. ఇప్పుడు వచ్చేస్తున్నాయి. ఈ పిల్స్ ను చైనా శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు.
మన దగ్గరి ఆయుర్వేద వైద్యం తీరుగా.. చైనాలోనూ సంప్రదాయ వైద్య ఉంది. అందులో విల్ ఫోర్డి హుక్ అనే ఓ మూలిక ఉంది. దీన్ని కీళ్ల నొప్పుల నివారణలో ఉపయోగించే వారు. అయితే.. అది వాడినప్పుడు కొన్ని నెలలపాటు మగవాళ్ల వీర్యంలోని శుక్రకణాల్లో చలనం ఆగిపోయేదట. దీంతో.. ఇదొక దుష్ప్రభావంగా భావించి, అత్యవసరమైన వారికే ఇచ్చేవారట.
అయితే.. ఈ కోణంలో వారికి ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. ఈ మూలికను వాడి మగవారికి పిల్స్ తయారుచేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. వెంటనే పని మొదలు పెట్టారు. ఈ మూలికతో పిల్ తయారు చేసి ఎలుకలు, కోతులపై ప్రయోగించారు. దీంతో.. వాటి వీర్యంలోని శుక్రకణాల్లో కదలికలు ఆగిపోయాయి. అదే సమయంలో వీర్య కణాల ఉత్పత్తిలో తేడా కూడా రాలేదట. అంతేకాదు.. ఇది హార్మోన్ల మీద కూడా ప్రభావం చూపలేదట. అయితే.. ఈ పిల్ తీసుకోవడం మానేయగానే.. మళ్లీ నాలుగు నుంచి ఆరువారాల్లో వీర్యంలోని శుక్రకణాల పనితీరు యథావిధి స్థితికి వచ్చిందట.
దీంతో.. ఇది అన్ని విధాలా సురక్షితమైన పిల్ అని భావిస్తున్నారు. ఆడవారికి గర్భనిరోధక మాత్రలు వేస్తే.. పలు దుష్ప్రభావాలు ఉంటాయనే ఆందోళనలు ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి.. ఇక మీదట మగవాళ్లు ఈ పిల్స్ ను ఉపయోగించాల్సి వస్తుందేమో.