అయోధ్యకి ప్రియాంక మద్దతు ... మండిపడ్డ పినరయ్ విజయన్ !

Update: 2020-08-06 15:00 GMT
అయోధ్య రామ మందిర నిర్మాణానికి మద్దతు తెలుపుతూ, కీలక వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై కేరళ సీఎం పినరరు విజయన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ సాప్ట్‌ హిందుత్వ ను పాటిస్తూనే ఉంటుందని వెల్లడించారు. రామ మందిరానికి మద్దతిస్తూ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలకు తమకి ఆశ్చర్యం అనిపించలేదని, మీకు ఆశ్చర్యం కలిగించిందేవెూ. కాంగ్రెస్‌ వైఖరేంటో మాకు బాగా తెలుసు అంటూ చెప్పారు.

ప్రియాంక వ్యాఖ్యల్లో నాకేమీ ఆశ్చర్యం కనిపించలేదు. మీకు ఆశ్చర్యం కలిగించిందేమో. కాంగ్రెస్ వైఖరేంటో మాకు బాగా తెలుసు. మాజీ ప్రధానులైన రాజీవ్, పీవీ వైఖరులేంటి? ఆ వైఖరులు చరిత్రలో నిక్షిప్తమై ఉన్నాయి అని ఆయన మండిపడ్డారు.సెక్యులరిజం అన్న దాన్ని కాంగ్రెస్ కఠినంగా అవలంబించి ఉంటే ప్రస్తుత పరిస్థితులు తలెత్తేవే కావని, కాంగ్రెస్ ఎప్పుడూ ‘సాఫ్ట్ హిందుత్వ’ను అవలంబించిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. గతంలో బాబ్రీ మసీదులో పూజలకు కాంగ్రెస్సే అనుమతించిందని, అలాగే ఆలయ పునాది రాయి వేయడానికి కూడా కాంగ్రెస్ అనుమతించిందని తీవ్రంగా మండిపడ్డారు. వీటితో పాటు కర సేవ కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, బాబ్రీని విధ్వంసం చేస్తున్నా కాంగ్రెస్ ప్రేక్షక పాత్ర వహించింది అని సీఎం విజయన్ మండిపడ్డారు.
Tags:    

Similar News