ట్విటర్ తో మొదలైన తొలగింపులు.. మెటాతో ఊపందుకొని ఇప్పుడు అమెజాన్ ను అల్లకల్లోలం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీ ఉద్యోగులకు రానున్నది గడ్డు కాలం అని అర్థమవుతోంది. పెరుగుతున్న ఆర్థిక మాంద్యం పరిస్థితులతో ఆదాయాలు పడిపోతున్నాయి. దీంతో టెక్ దిగ్గజాలన్నీ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల మెడపైనే కత్తి వేలాడదీస్తున్నాయి.
ఇప్పటికే మెటా, ట్విటర్, మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తొలగించగా.. ఇప్పుడు తాజాగా ప్రపంచ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఆ జాబితాలో చేరింది.గత వారం హైరింగ్ ప్రక్రియకు బ్రేక్ వేయనున్నట్టు అంతర్గత మెమోలో ప్రకటించిన అమెజాన్ ఇప్పుడు ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. తనను ఉద్యోగం నుంచి తొలగించినట్టు అమెజాన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జామీ జాంగ్ లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేయడంతో ఈ కలకలం మొదలైంది.
ఎక్కువ వేతనం గల ఉద్యోగులను తొలగిస్తున్నట్టు తేలడంతో అమెజాన్ ఉద్యోగులంతా ఆందోళనలో పడిపోయారు. అంతేకాదు.. రోబోటిక్స్ టీం మొత్తానికి పింక్ స్లిప్ లు అందించారని మాజీ ఉద్యోగి పోస్ట్ లో పేర్కొనడం మరింత ఆందోళనకు దారితీసింది.
లింక్డ్ ఇన్ డేటా ప్రకారం.. కంపెనీ రోబోటిక్స్ విభాగంలో కనీసం 3766 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ఎంతమందిని తొలగించారు అనేది స్ఫష్టత లేదు. దీనిపై అమెజాన్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఇక అమెజాన్ కంపెనీ సిబ్బందిని దొరికితే వేరే జాబ్ చూసుకోవాలని ఇప్పటికే ఆదేశించిందని సమాచారం. సంబంధిత ప్రాజెక్టులను త్వరలోనే నిలిపివేయనుందట.. అసాధారణమైన ఆర్థిక కారణాల రీత్యా రాబోయే కొన్ని నెలల పాటు కొత్త ఇంక్రిమెంటల్ హైర్ లను పాజ్ చేయాలని నిర్ణయించినట్టు పీపుల్ ఎక్స్ పీరియన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గలెట్టీ గతవారం జారీ చేసిన మెమోలో తెలిపారు. మొత్తంగా ఒక్కో కంపెనీలో ఈ పింక్ స్లిప్ ల గోలతో ఐటీ లో ఉద్యోగ భద్రత కరువైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.