ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణానికి టీడీపీనే కారణమని ఆయన ఆరోపించారు. భూమా వైసీపీలో ఉన్నప్పుడు గౌరవంగా చూసుకున్నామని.. టీడీపీలోకి వెళ్లిన తరువాత భూమా నాగిరెడ్డి మథనపడ్డారని చెప్పారు. కాగా అసెంబ్లీలో భూమా నాగిరెడ్డి మృతికి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడు వైసీపీ పాల్గొనలేదు. భూమా మృతికి కారణమైన చంద్రబాబే ఇప్పుడు సంతాప తీర్మానం ప్రవేశపెట్టడం దారుణమని వైసీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. వైసీపీలో ఉన్నప్పుడు భూమానాగిరెడ్డికి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించామన్నారు. చంద్రబాబు మంత్రి పదవి ఆశ చూపి పార్టీలోకి తీసుకుని ఏడాదిగా మానసికంగా హింసించారని ఆరోపించారు. భూమానాగిరెడ్డి చావుకు చంద్రబాబే కారణమని ఆరోపించారు.
భూమాను మోసం చేసి, ఆయన మరణానికి కారణమైన టీడీపీతో కలిసి సంతాప కార్యక్రమంలో పాల్గొనకూడదన్న ఉద్దేశంతోనే తాము భూమా సంతాపకార్యక్రమానికి హాజరుకాలేదని వైసీపీ నేతలుచెప్పారు. భూమా నాగిరెడ్డి మరణం చాలా బాధాకరమని పిన్నెల్లి చెప్పారు. భూమా కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు.
భూమా మృతికి కారణమైన చంద్రబాబే ఇప్పుడు సంతాపతీర్మానం ప్రవేశపెట్టడం సరైంది కాదన్నారు. చంద్రబాబు తీరుతో భూమా ఆత్మ క్షోభిస్తుందన్నారు. చంద్రబాబు మాటలు విని టీడీపీలో చేరిన మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే ఉందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. కాగా భూమా మృతికి బాబే కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న తరుణంలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సభను బహిష్కరించిన విషయంలో వైసీపీపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/